Rathika, Rahul Sipliganj: రాహుల్ – రతిక..ల మేటర్ ఇలా బయటపడింది..!

  • September 8, 2023 / 04:35 PM IST

బిగ్ బాస్ సీజన్ 7 ఈ మధ్యనే ప్రారంభమైంది. ఈ సీజన్లో రతిక రోజ్ అనే కంటెస్టెంట్‌ ఎంట్రీ ఇచ్చింది. చూడటానికి ఈ అమ్మాయి అందంగానే ఉంది. ఈమె గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ నడుస్తోంది. దానికి కారణం.. ఆమె హౌస్ లోకి వెళ్లే ముందు.. స్టేజి పై హోస్ట్ నాగార్జునతో స్పందించిన తీరుకి అని చెప్పాలి. స్టేజ్ మీదికి రతిక అలా వచ్చిందో లేదో ఆ వెంటనే.. నాగార్జున.. “‘నీ హార్ట్ ఎలా ఉంది ఇప్పుడు’ అని అడిగాడు.

అందుకు ఆమె చాలా నార్మల్‌గా ఉందని చెప్పింది. తర్వాత నాగార్జున ‘‘హార్ట్ బ్రేక్ నుండి బయట పడ్డావా?’ అంటే.. ‘హా..’ అంటూ రతిక నవ్వుకుంది. తర్వాత.. ‘చేసిందంతా చేసి ఎంత బాగా నవ్వుతూ అడుగున్నారో’ అంటూ నాగార్జునని రతిక అంది. మధ్యలో నేనేం చేశానమ్మా? అని నాగార్జున అంటే.. ‘మొత్తం మీరే చేశారు.. చేసిందంతా చేసేసి.. ఎంచక్కా ఏమీ తెలియనట్టు హార్ట్ బ్రేక్ అయ్యింది కదా ఎలా ఉందని అడుగున్నారు? అంటూ రతిక అంది.

అటు తర్వాత (Rathika) రతిక .. ‘నేను హౌస్ లోకి వెళ్ళాక తెలుస్తుంది మీకు, పెద్దయ్యకి’ అంటూ ఆసక్తికరంగా కామెంట్ చేసింది. మళ్ళీ కాసేపటికి ‘నీకు ఇమిటేషన్ చేయడం బాగా వచ్చు కదా. నీకు హార్ట్ బ్రేక్ చేసిన వాడిని ఇమిటేట్ చెయ్యి’ అంటూ నాగార్జున రతికతో చెప్పారు. అప్పుడు రతిక.. ‘అంటే నేనిప్పుడు పాట పాడాలా? ‘ అని అంది. అంటే రాహుల్ సిప్లిగంజ్ సింగర్ అని పరోక్షంగా రతిక చెప్పినట్టే.. అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus