Actress Samyuktha: ఒకప్పటి నటి సంయుక్త గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు!

తెలుగుతో పాటు ఏ ఇండస్ట్రీలో చూసినా సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ లుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. తెలుగువారి ఆల్ టైమ్ ఫేవరేట్ ‘రక్త సంబంధం ’ నుంచి నిన్న మొన్నటి ‘రాఖీ’ వరకు ఇలా ఎన్నో వున్నాయి. అయితే మారుతున్న కాలానికి తగ్గట్టే చెల్లెలి పాత్రలో మేకర్స్ మార్పులు చేశారు. అన్నంటే ప్రాణమిచ్చే వ్యక్తిత్వంతో పాటు ఆయనను సరదాగా ఆటపట్టించేదిగా చెల్లి మారిపోయింది. పాత్ర స్వభావం ఎలాంటిదైనా తెలుగు చిత్ర సీమలో ‘సిస్టర్’ సెంటిమెంట్ కు ఎప్పుడూ క్రేజ్ తగ్గలేదు.

అయితే చెల్లి పాత్రల కోసమే పుట్టినట్లుగా కొందరు గుర్తుండిపోతారు. వాళ్లను తప్ప మరొకరిని ఊహించుకోలేం. అలాంటి వారిలో ఒకరు ‘సంయుక్త’. ఇప్పటి వరకు తెలియకపోవచ్చు గానీ.. 1970, 80 దశకాల్లో పుట్టిన వారికి మాత్రం ఈమె సుపరిచుతురాలే. 80-90ల మధ్య సిస్టర్ రోల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సంయుక్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంత పెద్ద హీరోకైనా సరే చెల్లిగా నటించాలంటే మేకర్స్ కు వెంటనే ఆమె గుర్తొచ్చేవారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సంయుక్త..

తర్వాత హీరోయిన్‌కు ఫ్రెండ్ గా, హీరోలకు చెల్లిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ఇప్పుడు సీరియల్ నటిగా సెటిలయ్యారు. తెలుగు, తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో దాదాపు 50 సంవత్సరాలుగా నటిస్తూనే వున్నారు సంయుక్త అలియాస్ ‘నిత్య రవీంద్రన్’.ఈమె చెల్లిగా నటించింది మెగాస్టార్ చిరంజీవితోనే ఎక్కువ కావొచ్చు. ఖైదీ, న్యాయం, మీరే చెప్పాలి, స్వయంకృషి వంటి సినిమాల్లో చిరంజీవికి ఎంత పేరొచ్చిందో, ఆమెకు అంతే వచ్చింది.

అయితే ఆ తర్వాత పెళ్లి, పిల్లలు కారణంగా సంయుక్త ఇండస్ట్రీకి దూరమయ్యారు. సినిమాటోగ్రాఫర్ రవీంద్రన్ ను ఆమె పెళ్లాడారు. వీరికి ఇద్దరు పిల్లలు, కొడుకు అర్జున్, కుమార్తె జనని. అర్జున్ కూడా తమిళ సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై సంయుక్త బిజీగా ఉన్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus