God Father Movie: పవన్ ఫ్యాన్స్ ఆశల్ని చిరు తీరుస్తారా?

మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్సైంది. మలయాళంలో లూసిఫర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేశారు. కొన్నేళ్ల క్రితం రాజకీయాలతో బిజీగా ఉన్న చిరంజీవి ప్రస్తుతం పాలిటిక్స్ కు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

లూసిఫర్ సినిమా కథ ప్రకారం తమ్ముడి పొలిటికల్ లైఫ్ కు చిరంజీవి పాత్ర అండగా ఉండటంతో పాటు తమ్ముడి లైఫ్ ను సెట్ రైట్ చేయడంలో చిరంజీవి పాత్ర కీలకంగా ఉంటుంది. రియల్ లైఫ్ లో కూడా జనసేన పార్టీకి చిరంజీవి సపోర్ట్ ఇస్తే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్టే అని భావించాల్సి వస్తోంది. అయితే 2024 ఎన్నికల సమయంలో చిరంజీవి జనసేన పార్టీకి మద్దతు ప్రకటిస్తారా..?

ప్రకటించరా..? అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. చిరంజీవి మద్దతు ఇస్తే మాత్రం జనసేన పార్టీ మరింత మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిరంజీవి లూసిఫర్ రీమేక్ ను కేవలం 4 నెలల్లో పూర్తి చేస్తారని ప్రచారం జరుగుతుండగా అనుకున్న ప్రకారం ఈ మూవీ షూటింగ్ జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది. త్వరలో చిరంజీవి వేదాళం రీమేక్ షూటింగ్ లో కూడా పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus