Rishab Shetty: పేరు మార్పు.. ప్రేమ పెళ్లి.. ఫౌండేషన్‌.. రిషభ్‌ శెట్టి గురించి ఈ విషయాలు తెలుసా?

‘కాంతార’ అంటూ వచ్చి.. ఇండియన్‌ సినిమా చరిత్రలో ఎవరూ ఊహించని విజయం అందుకున్నాడు రిషభ్‌ శెట్టి. నటుడిగా, దర్శకుడిగా చేసిన ఆ సినిమా రూ. 14 కోట్ల బడ్జెట్‌తో రూపొంది.. రూ.450 కోట్లు వసూలు చేసింది. ఇది చాలు ఆ సినిమా సత్తా ఏంటో చెప్పడానికి.. దాన్ని తీర్చిదిద్దిన రిషభ్‌ టాలెంట్‌ గురించి తెలియడానికి. ఇలాంటి వ్యక్తి.. ఇప్పుడు ‘కాంతార: చాప్టర్‌ 1’ అంటూ ‘కాంతార’కు ప్రీక్వెల్‌ తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దామా!

Rishab Shetty

రిషభ్‌ శెట్టి గురించి ‘కాంతార’ సినిమా సమయంలో చాలా ఇంటర్వ్యూలు వచ్చాయి. అందులో రిషబ్‌ శెట్టి వాటర్‌ బాయ్‌గా, క్లాప్‌ బాయ్‌గా పనిచేశాడనే విషయాలు బయటికొచ్చాయి. ఇదే కాకుండా ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. రిషభ్‌ చిన్నతనంలో దూరదర్శన్‌లో కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌ కుమార్‌ పాటలను చూసి ఆయనలా హీరో కావాలని అనుకున్నాడట. అలాగే కన్నడ స్టార్‌ హీరో, దర్శకుడు ఉపేంద్రను చూసి డైరక్షన్‌ చేయాలని రిషభ్‌ అనుకున్నారట. ఎందుకంటే ఇద్దరిదీ ఒకే ప్రాంతమే.

ఇక డిగ్రీ చదువుకోమని ఇంట్లో వాళ్లు బెంగళూరు పంపిస్తే, ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు రిషభ్‌. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. రిషభ్‌ అసలు పేరు ప్రశాంత్‌ శెట్టి. అయితే సినిమాల్లోకి వచ్చే ముందు ప్రత్యేకమైన పేరును ఎంచుకోవాలని అనుకున్నాడట. అలా స్నేహితుల సూచనతో రిషబ్‌ శెట్టి అని మార్చుకున్నాడు. నటనలో కమల్‌ హాసన్‌ తనకు దేవుడితో సమానం. అమితాబ్‌ బచ్చన్‌ తెరపైన కనిపించే తీరు చూసే ‘కాంతార’లో తన పాత్ర రాసుకున్నాడట రిషభ్‌.

సినిమాల్లో ఇప్పుడిప్పుడే స్టార్‌ హీరో అవుతున్న రిషభ్‌.. సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. రిషబ్‌ శెట్టి ఫౌండేషన్‌ ద్వారా సొంత ప్రాంతం కుందాపూర్‌ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నాడు. పిల్లలకు ఆర్థిక సాయం కూడా చేస్తున్నాడు. ఇక ప్రేమపెళ్లి గురించి మాట్లాడుకుంటే భార్య ప్రగతిని ఓ సినిమా ఫంక్షన్‌లో కలిశారట. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారని.. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌ అనీ తెలుసుకున్నారట. అలా మొదలైన స్నేహం ప్రేమగా మారి వివాహ బంధంగా మారిందట.

నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షోతో మైండ్ బ్లాక్ చేస్తున్న జాన్వీ కపూర్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus