హిందూ – ముస్లిం ప్రేమకథ.. ఈ కాన్సెప్ట్ టాలీవుడ్‌కి కొత్తేం కాదు. చాలా ఏళ్ల క్రితం ఈ కాన్సెప్ట్‌లో సినిమాలొచ్చాయి. ఇటీవల వచ్చాయి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌లో ‘ఖుషి’ సినిమా తెరకెక్కుతోందా? ఏమో మొన్నీమధ్య వచ్చిన ఓ పాటను చూసి అంచనా వేసేస్తున్నారు. అందులో సమంత ఓ సమయంలో బురఖా ధరించి కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయిల ప్రేమకథ అనేస్తున్నారు. మరికొందరైతే ఇందులో కొత్తేముంది ‘బొంబాయి’ సినిమా లాంటి కథనా అనేస్తున్నారు. అయితే శివ నిర్వాణ సన్నిహితులు మాత్రం అలా కాదు అంటున్నారు.
విజయ్ దేవరకొండ, (Samantha) సమంత జంటగా ‘ఖుషి’ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్ నేపధ్యంలో ఓ ప్రేమ కథ ఇదని పోస్టర్‌తోనే చెప్పేశారు కూడా. ఆ మధ్య అక్కడ పెద్ద షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. అయితే ఇటీవల విడుదల చేసిన పాట, పోస్టర్స్‌లో సమంత బురఖాలో కనిపించింది. దీంతోనే ఈ పుకార్లు మొదలయ్యాయి. కశ్మీర్ నేపథ్యం ఉండటం పాటలో.. ‘రోజా’ అనే పేరు రావడం, ‘బొంబాయి’ సినిమాలో మనిషా గెటప్ ఉండటంతో ఈ డౌట్స్ ఎక్కువయ్యాయి.
అయితే ఈ సినిమా కథలో అసలు పాయింట్ అది కాదు అంటున్నారు. నాస్తిక, ఆస్తికులకు మధ్య జరిగే ప్రేమకథ ఇదని సమాచారం. ఈ నేపథ్యంలోనే రెండు ప్రపంచాల కథ అని పోస్టర్ మీద వేశారట. పాటలో కనిపించిన బురఖా సీన్.. సినిమాలో ఓ కీలక ట్విస్ట్‌లో వస్తుందని చెబుతున్నారు. రొటీన్‌కి భిన్నంగా ఓ మంచి ప్రేమకథని చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాం అని టీమ్ చాలా రోజుల నుండి చెబుతోంది. అయితే ఈ కథ ఆలోచన కొత్తగా ఉంటుంది అని మాత్రం అంటున్నారు.
ఈ లెక్కన ఈ సినిమా హిందూ – ముస్లిం ప్రేమకథ కాదు అని మాత్రం చెబుతున్నారు. ఒకవేళ ఆ కాన్సెప్ట్‌తో వస్తే మాత్రం పాత సినిమాల పోలికలు ఎక్కువై సినిమా ఫలితం మీద ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ విషయంలో టీమ్ అధికారికంగా క్లారిటీ ఇస్తే మంచిదేమో. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా సెప్టెంబరు 1న విడుదల చేస్తున్నారు. విజయ్ ‘లైగర్’ ఫలితం, సమంత ఆరోగ్యం వల్ల ఈ ఆలస్యం అని చెప్పొచ్చు.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?