స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కాగా మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. సాధారణంగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. బోయపాటి శ్రీను అఖండ మూవీ క్లైమాక్స్ ను కూడా భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కనిపిస్తుండగా ఆ పాత్ర సినిమాలో ఎక్కువ సమయం ఉండదని సమాచారం. అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా లొకేషన్ స్టిల్ రిలీజ్ కాగా బోయపాటి శ్రీను పోస్టర్ లో తుపాకులను హైలెట్ చేస్తూ చూపించారు. కడప పరిసరాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా పోస్టర్ ను చూస్తుంటే సింహా, లెజెండ్ క్లైమాక్స్ ను మించి బోయపాటి శ్రీను అఖండ క్లైమాక్స్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా ప్రగ్య జైస్వాల్ ఈ సినిమలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమాలో బాలయ్యకు సంబంధించిన మరో లుక్ ను బోయపాటి శ్రీను ఇప్పటివరకు రివీల్ చేయలేదు. షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని బోయపాటి శ్రీను భావిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.