Sreeleela: వరుసగా ఒకేలాంటి పాత్రలు… ఇలా అయితే లాంగ్‌ రన్‌ కష్టమే శ్రీలీలా…

టాలీవుడ్‌ మోస్ట్‌ బిజియెస్ట్‌ అండ్‌ క్యూటెస్ట్ హీరోయిన్‌ ఎవరు అంటే… వినిపించే ఏకైక పేరు శ్రీలీల. కొత్త సినిమా ప్రారంభమవుతోంది అంటే అందులోనూ స్టార్‌ హీరో సినిమా ప్రారంభమవుతుంది అంటే శ్రీలీల పేరే వినిపించింది. అయితే రీసెంట్‌గా ఆమె సినిమాలు, అందులోని పాత్రలు చూస్తుంటే ‘ఎక్కడో తేడా కొడుతోంది శ్రీలీలా?’ అనిపించకమానదు. రీసెంట్‌ రెండు సినిమాలు చూశాక ఇంకా ఎక్కువ అనిపిస్తోంది. శ్రీలీలకు ఈ ఏడాది ఆల్‌మిక్సర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ ఏడాది ఆమెకు ఒక్క హిట్ పడితే మూడు ఫ్లాప్స్ ఖాతాలో పడ్డాయి.

ఇక్కడో విషయం ఏంటంటే ఆమె హీరోయిన్‌గా చేసిన సినిమాకు హిట్టే రాలేదు. ఎందుకంటే ‘భగవంత్‌ కేసరి’లో శ్రీలీల హీరోయిన్‌ కాదు. అది కాకుండా వచ్చిన మిగిలిన మూడు సినిమాలు ‘స్కంద’, ‘ఆదికేశవ’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్‌’ ఫలితాలు తేడా కొట్టాయి. అంతేకాదు ఆమె పాత్రలు కూడా వీక్‌ అనిపించుకున్నాయి. దీంతో శ్రీలీల పాత్రల ఎంపిక విషయంలో విమర్శలు చాలానే వస్తున్నాయి.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుని శ్రీలీల (Sreeleela) వరుసగా సినిమా ఓకే చేసేస్తోంది తప్ప కథలు పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు, పాత్రలు వినడం లేదు అనే పుకార్లు వస్తున్నాయి. దానికి కారణం రీసెంట్‌ రెండు సినిమాల ఫలితాలే. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్‌’ సినిమాలో శ్రీలీల పాత్ర ఓ పెద్ద కంపెనీకి ఓనర్. కంపెనీలో ఆడిట్ టెన్షన్స్ కారణంగా మందేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్‌లో దొరుకుతుంది. నితిన్ అక్కడ కాపాడతాడు.

ఆ తర్వాత నితిన్‌ని ఇంటికి పిలిచి ఆ తర్వాత కంపెనీకి సీఈవోగా చేస్తుంది. ఇక వైష్ణవ్ తేజ్‌తో నటించిన ‘ఆదికేశవ’ సంగతి చూస్తే… అందులో హీరోయిన్ క్యారెక్టర్ ఓ పెద్ద కంపెనీకి సీఈవో. హీరో అక్కడకు ఇంటర్వ్యూకు వెళతాడు. అతనిచ్చిన ఐడియా నచ్చి మార్కెటింగ్ హెడ్ ఉద్యోగం ఇచ్చేస్తుంది. ఆ తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది. దీంతో ఒకేలాంటి రెండు పాత్రలు వెంట వెంటనే ఎలా ఓకే చేసేసింది. ఇలా అయితే కష్టమే అని అంటున్నారు నెటిజన్లు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus