Jr NTR : ఎన్టీఆర్ చేత అలాంటి ప్రామిస్ చేయించుకున్న శాలిని!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని పాన్ ఇండియా హీరోగా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ గురించి పరిచయం అవసరం లేదు హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ ఇన్నేళ్ల సినీ కెరియర్లో ఎప్పుడూ కూడా ఈయనపై ఒక మచ్చ కాని రాలేదని చెప్పాలి. ఇండస్ట్రీలో ఉన్న తర్వాత చాలామంది సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

ఇలా ఎంతో మంది హీరోల గురించి ఎన్నో వార్తలు వచ్చిన ఎన్టీఆర్ గురించి మాత్రం ఎలాంటి రూమర్స్ బయటకు రాలేదు. ఇలా ఎన్టీఆర్ గురించి ఏ విధమైనటువంటి రూమర్స్ బయటకు రాకపోవడానికి కారణం ఆయన పెంపకమే అని చెప్పాలి. ఎన్టీఆర్ తల్లి శాలిని చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ను ఎంతో క్రమశిక్షణతో పెంచారని చెప్పాలి. పెద్దలకు గౌరవం ఇవ్వడం నుంచి మొదలుకొని మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలి అనే విషయాలన్నింటిని కూడా శాలిని ఎంతో అర్థవంతంగా చిన్నప్పుడే ఎన్టీఆర్ కు వివరించారట.

ఒకానొక సమయంలో శాలిని ఎన్టీఆర్ తో మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల హీరోయిన్ల పట్ల ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడుకూడదని అలా ప్రవర్తించకూడదని, వారికి గౌరవం ఇవ్వాలని చెబుతూ ఎన్టీఆర్ నుంచి మాట తీసుకున్నారట. అలాగే తాను ఏ పని చేసినా నందమూరి కుటుంబ పరువు ప్రతిష్టలు పోకుండా జాగ్రత్త పడేలా ఉండాలని మాట తీసుకున్నారుట. అలా అప్పుడు తల్లికి ఇచ్చినటువంటి ఈ మాట ప్రకారం ఎన్టీఆర్ ఎప్పుడు కూడా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన దాఖలాలు కనపడవు అలాగే వారికి ఎంతో గౌరవం ఇస్తుంటారు.

ఇలా ఎన్టీఆర్ (Jr NTR ) మహిళలకు తోటి సెలబ్రిటీలకు ఎంతో గౌరవం ఇస్తారనే విషయాన్ని ఇది వరకు ఎంతో మంది సెలబ్రిటీలు ఈయన గొప్పతనం గురించి తెలియజేశారు. ఇక తల్లిదండ్రుల పట్ల ఎన్టీఆర్ కూడా ఎంతో గౌరవంగా ప్రేమగా ఉండేవారనే విషయం మనకు తెలిసిందే. ఇలా చిన్నప్పటి నుంచి ఎంతో పద్ధతిగా పెరిగినటువంటి ఎన్టీఆర్ చివరికి తన కుటుంబ సభ్యులు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకొని ప్రస్తుతం వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus