Anushka Shetty: అనుష్క కూడా ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోబోతోందా?

ఇండస్ట్రీలో కొనసాగే హీరోలు హీరోయిన్లు ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే అందానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అందంగా ఉంటేనే వారికి సినిమాలలో అవకాశాలు వస్తాయనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోలు హీరోయిన్లు సర్జరీలు చేయించుకుంటూ తమ అందాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు సర్జరీలు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి పలువురు హీరోలు హీరోయిన్లు కూడా ఇలా సర్జరీలు చేయించుకున్నారు.

తాజాగా నటి అనుష్క శెట్టి కూడా సర్జరీ చేయించుకోబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనుష్క సర్జరీ చేయించుకోకపోయిన సహజంగానే చాలా అందంగా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అందంగా ఉన్నటువంటి ఈమె ఎందుకు సర్జరీ చేయించుకుంటున్నారు అసలు ఏ పార్ట్ కి సర్జరీ చేయించుకుంటున్నారు అనే విషయానికి వస్తే.. అనుష్క శెట్టి సర్జరీ చేయించుకుంటుంది అంటే తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం సర్జరీ చేయించుకోవడంలేదని తన ఆరోగ్యం కోసం సర్జరీకి సిద్ధమయ్యారు అంటూ ఈ వార్త వైరల్ గా మారింది.

గత కొద్దిరోజులుగా మోకాలు నొప్పి సమస్యతో బాధపడుతున్నారట అయితే పలువురు డాక్టర్లను సంప్రదించగా మోకాలికి చిన్న సర్జరీ అవసరమని చెప్పడంతో ఈమె సర్జరీకి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక ఈ సర్జరీ విదేశాలలో చేయించుకోబోతున్నారట. ఇలా సర్జరీ కారణంగా అనుష్క కొద్దిరోజుల పాటు విశ్రాంతి అవసరమని చెప్పడంతో ఈమె (Anushka Shetty) కొన్ని నెలల పాటు సినిమాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని

అందుకే ఈమె కమిట్ అయినటువంటి సినిమాలకు తీసుకున్నటువంటి అడ్వాన్స్ కూడా వెనక్కి ఇస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అనుష్క గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇది మాత్రం వైరల్ అవుతుంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus