Balakrishna, Trivikram: త్రివిక్రమ్ బాలయ్యతో మూవీ తీస్తారా?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంటుంది. బాలయ్య త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా బాలయ్య హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కనుందని చెప్పగా త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాధారణంగా హారిక హాసిని బ్యానర్ లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలు మాత్రమే నిర్మిస్తారు.

మరి ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. మరోవైపు డైరెక్టర్లు, బ్యానర్ల ఎంపిక విషయంలో బాలకృష్ణ గతంతో పోలిస్తే మారారు. టాప్ డైరెక్టర్లు, నిర్మాణ సంస్థల సినిమాలలో బాలకృష్ణ నటిస్తుండటం గమనార్హం. బాలయ్య ప్రస్తుతం ట్రెండ్ ను ఫాలో అవుతూ సినిమాలపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. త్రివిక్రమ్ ఆస్థాన నిర్మాణ సంస్థ అయిన హారిక హాసిని బ్యానర్ లో బాలయ్య ఒక సినిమాలో నటించడం కూడా ఆశ్చర్యకరమైన విషయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో బాలయ్య నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అఖండ సినిమాతో బాలయ్య సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా తరువాత వరుసగా టాప్ డైరెక్టర్ల డైరెక్షన్ లోనే బాలయ్య నటిస్తుండటం గమనార్హం. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో అఖండ సినిమా రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య అఖండ సినిమాతో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus