Mahesh Babu: మహేష్‌ – అనిల్‌ సినిమా ఓకే అవ్వడం వెనుక ఇంత జరిగిందా?

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా అనౌన్స్‌ అయిన తొలి రోజుల్లో చాలా మందికి వచ్చిన డౌట్‌ ‘ఈ సినిమా ఎలా ఓకే అయింది’ అని. ఎందుకంటే మహేష్‌బాబు కొత్త దర్శకులు, ఇంకా స్టార్‌ అయ్యే ప్రోసెస్‌లో ఉన్న దర్శకులకు డేట్స్‌ ఇవ్వడం అప్పట్లో అరుదు. అందులోనూ మాస్‌, కమర్షియల్‌ అంశాలు ఎక్కువగా ఉండే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారాయన. కానీ అనిల్‌ రావిపూడి చెప్పిన కథకు ఓకే చెప్పి ముందుకెళ్లారు. అప్పుడు సినిమా ఓకే అవ్వడం వెనుక ఏం జరిగిందో ఇటీవల సినిమా నిర్మాత అనిల్‌ సుంకర్‌ చెప్పుకొచ్చారు.

Mahesh Babu

అనిల్ రావిపూడి కెరీర్‌లో అప్పటికే ‘ప‌టాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్‌ 2’ లాంటి వరుస విజయాలు ఉన్నా.. టాప్‌ జోన్‌లో ఉన్న హీరోతో చేసిన తొలి సినిమాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’నే ఫస్ట్‌ది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన దిల్‌ రాజుకు పూర్తిగా వివరాలు తెలియకుండానే ఈ సినిమా ఓకే అయిందట. ఈ విషయాన్ని కూడా అనిల్‌ సుంకరనే చెప్పుకొచ్చారు. ఒక విధంగా ఈ సినిమా ఓకే అవ్వడం ఆయనకో షాక్‌ అని కూడా చెప్పారు.

ఇక్కడో విషయం ఏంటంటే ఈ సినిమా అవుతున్న సమయంలో మహేష్ బాబు – దిల్ రాజు కాంబినేషన్‌లో ‘మహర్షి’ తెరకెక్కుతోంది. మ‌హేష్ ‘స్పైడ‌ర్’ ఫలితం చూసి చాలా ఇబ్బందిపడ్డారట. అంతకుమందే ‘బ్ర‌హ్మోత్స‌వం’ లాంటి ఇబ్బందికర ఫలితం అందుకున్నాడు. ఆ సమయంలో అనిల్‌ సుంకర ఓసారి కలసి ‘దూకుడు’ లాంటి ఓ సినిమా చేద్దాం అని అనుకున్నారట. అప్పుడే ‘రాజా ది గ్రేట్‌’ విజయంతో అనిల్‌ సుంకర ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు.

దీంతో అనిల్ రావిపూడితో సినిమా చేస్తే బాగుంటుంద‌ని అనిల్‌ సుంకర ప్రస్తావిస్తే.. మ‌హేష్ వెంటనే ఓకే చేశారట. అలా ‘ఎఫ్‌ 2’ సినిమా కంటే ముందే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఓకే చేసుకొని లైన్‌లో పెట్టారట. ఇక సింగిల్ సిట్టింగ్‌లోనే ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమా క‌థ‌కు మహేష్‌ ఓకే చెప్పేశాడ‌ట. అలా దిల్‌ రాజుకు తెలియ‌కుండానే సినిమా ఫిక్స్ అయిపోయిందని అనిల్‌ సుంకర తెలిపారు.

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus