‘కూలీ’ సినిమా పోస్టర్లు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వచ్చారు. రజనీకాంత్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఓ విషయం మీద అందరి దృష్టి పడింది. అదే ఆయన పట్టుకున్న బ్యాడ్జి నెంబరు. సినిమా దేవా అనే కూలీ పాత్రలో రజనీ నటిస్తున్నారని, అతని బ్యాడ్జి నెంబరు 1421 అని చెప్పారు. ఎందుకు ప్రత్యేకంగా ఆ నెంబరు పెట్టారు అనే డౌట్ చాలా మందికి ఉండి ఉంటుంది. సినిమా ప్రచారంలో చెబుతారులే అనుకున్నారు కొందరు. వాళ్లందరూ అనుకున్నది నిజమే. ఆ బ్యాడ్జి నెంబరు వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ ఉంది.
‘కూలీ’ సినిమా ఆడియో రిలీజ్, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఆ వేదిక మీద దర్శకుడు లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు ఎన్నో చెప్పారు. అందులో ఈ కూలీ బ్యాడ్జి విషయం కూడా ఉంది. లోకేష్ తండ్రి బస్ కండక్టర్. ఆయన కూలీ బ్యాడ్జ్ నంబర్ 1421. తన తండ్రికి గుర్తుగా ఆ బ్యాడ్జి నంబర్‌ను ‘కూలీ’ బ్యాడ్జ్ నంబర్‌గా పెట్టి నా తండ్రికి అంకితం ఇచ్చానని లోకేష్ కనగరాజ్ చెప్పారు.
ఇది మా నాన్న బ్యాడ్జ్ నంబర్. ఆయన బస్ కండక్టర్ అని రజనీకాంత్‌కు చెప్పినప్పుడు ‘మీ తండ్రి కండక్టర్ అని మీరు నాకు ఎందుకు చెప్పలేదు?’ అని అడిగారు. నా తండ్రి రజనీకాంత్ గురించి తనకు తానుగా చెప్పదల్చుకోలేదని, ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాలని అనుకున్నానని రజనీకాంత్‌కు చెప్పారట లోకేశ్ కనగరాజ్. ఆయన అడిగినప్పుడు చెబితే అప్పుడు అది మరింతగా గుర్తుండిపోతుందని తాను అనుకున్నానని లోకేశ్ అన్నారు. అదే జరిగింది అని చెప్పారు.
ఇక ఈ సినిమా గురించి చూస్తే ఆగస్టు 14న సినిమాను విడుదల చేస్తున్నారు. రజనీకాంత్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సౌబిన్ సాహిర్, నాగార్జున ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.