సుకుమార్ సినిమాల్లో ఆసక్తికలిగించే టైటిల్ కార్డ్స్

డైరక్టర్ సుకుమార్ ఆలోచనలు టాలీవుడ్ ని ఒక అడుగు ముందుకు పోనిచ్చేలా ఉంటుంది. ఆయన మూవీస్ లో ప్రతిదీ డిఫరెంట్ గా ఉంటుంది. కథ, క్యారేక్టరైజేషన్, క్లైమాక్స్.. ఇలా అన్ని కొత్తగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే టైటిల్ కార్డ్స్ లోను ఆయన స్టైల్ కనిపిస్తుంది. సుకుమార్ సినిమాలోని టైటిల్స్ కార్డ్స్ గమనిస్తే.. ఆ సినిమా కథకు తగ్గట్టు టైటిల్ కార్డ్స్ ఉంటాయి. ఇంకా నమ్మకం కుదరకపోతే.. ఈ ఆర్టికల్ చదవి.. గుర్తుకు తెచ్చుకోండి..

ఆర్య

సుకుమార్ మొదటి మూవీ ఆర్య. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో పెద్దగా క్రియేటివిటీ చూపించక పోయినా అతని మార్క్ కనిపిస్తుంది. సింపుల్ గా ఇది వీళ్ల ముగ్గురి స్టోరీ అని.. లీడ్ యాక్టర్స్ పేర్లు మాత్రమే టైటిల్ కార్డ్స్ లో ఉంటాయి.

జగడం

జగడం మూవీ టైటిల్ ఒక బ్లింక్ అవుతున్న బల్బ్ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. పేర్లు మారుతూ ఉంటాయి. ఇది హీరో క్యారేక్టరైజేషన్ ని తెలుపుతుంది.

ఆర్య 2

హీరో ఆర్య కి అన్ని తన డైరీ లో రాసుకునే అలవాటు ఉంది. సో టైటిల్ కార్డ్స్ కూడా అదే విధంగా డిజైన్ చేశారు.

100% లవ్

ప్రేమను కూడా అంకెల్లో కొలవచ్చని సుకుమార్ ఈ ప్రేమకథను రాసుకున్నారు. అలాగే పరీక్షలు, ర్యాంకుల గోల… ఈ విషయం అర్ధమయ్యేలా టైటిల్ కార్డ్స్ ని పరీక్ష ప్రశ్న పత్రం రూపంలో చూపించారు.

1 నేనొక్కడినే

నేనొక్కడినే లో చిన్నప్పటి సాంగ్ చుట్టూ కథ తిరుగుతుంటుంది. ఆ పాట గుర్తుకు రాగానే అన్ని చిక్కుముడులు విడిపోతాయి. ఆ ట్యూన్, ఆ ఇన్స్ట్రుమెంట్ డిఫెరెంట్ గా ఉంటుంది. అందుకే టైటిల్ కార్డ్స్ మొత్తము ఆ ఇన్స్ట్రుమెంట్ మెకానిజంతో తో లింక్ అయి ఉంటాయి.

కుమారి 21F

ఈ మూవీ కి క్రియేటివిటీ మాత్రం పీక్స్ లో ఉంటది. ఒక మొబైల్ తీసుకుని దాంట్లో ఉన్న అప్స్ అన్ని ఉపయోగిస్తూ, టైటిల్ కార్డ్స్ స్క్రీన్ పై పడుతుంటుంది.

నాన్నకు ప్రేమతోఒకచోట జరిగే యాక్షన్ ఇంకోచోట లింక్ అయి ఉంటది.. ఈ థీమ్ తోనే నాన్నకు ప్రేమతో.. మూవీ కథ ముడిపడిఉంటుంది. అందుకే టైటిల్ కార్డ్స్ కూడా ఒక చైన్ రియాక్షన్ ద్వారా మనకు చూపించారు.

ఎప్పుడూ ఒక అడుగు ముందు ఆలోచించే సుకుమార్ ఈసారి పాతికేళ్ళు వెనక్కి వెళ్లారు. ఆనాటి కథతో రంగస్థలం సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా టైటిల్స్ లో ఎటువంటి క్రియేటివిటీ చూపిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus