ఆసక్తికర పేరుని ఫిక్స్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి చేస్తున్నారు. ఇది వచ్చే నెల థియేటర్లోకి రానుంది. దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా మొదలుపెట్టనున్నారు. ఈ రెండు సినిమాల మధ్యలో మరో సినిమాని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. నితిన్, మేఘా ఆకాష్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అలనాటి తార లిజీ కీలకరోల్ పోషిస్తోంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథని అందించడమే కాదు… రీసెంట్ గా టైటిల్ ని కూడా సూచించారంట.

అతను చెప్పిన ”గుర్తుందా శీతాకాలం” అనే టైటిల్ డిఫరెంట్ గా ఉండడంతో చిత్ర బృందం ఒకే చెప్పినట్లు తెలిసింది. ఫస్ట్ లుక్ రిలీజ్ సమయంలో ఈ టైటిల్ ని రివీల్ చేస్తారు. విభిన్నమైన ప్రేమకథతో వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో రావు రమేష్ పాత్ర కొత్తగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత సతీష్ వేగ్నేష్ డైరెక్షన్లో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus