బాలకృష్ణ, వినాయక్ సినిమాకి టైటిల్ ఇదేనా?

నటసింహ నందమూరి బాలకృష్ణ  ప్రస్తుతం తనతండ్రి బయోపిక్ ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ గా నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మహానటుడు, పేదల దేవుడు అయిన ఎన్టీఆర్ బయోపిక్ ని అద్భుతంగా రూపొందించాలని క్రిష్ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత ప్రాజక్ట్ కి కూడా బాలకృష్ణ ఓకే చెప్పారు. వివి వినాయక్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కంప్లీట్ చేసిన వినాయక్, ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. సి. కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం.

బాలయ్యకు ఫ్యాక్షన్ కథలు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాయి. అలాగే వినాయక్ తొలి సినిమానే రాయలసీమ నేపథ్యంలో తీసి అదరగొట్టారు. సో ఇద్దరికీ ఫ్యాక్షన్ కథ కలిసొస్తుందని నమ్మకం ఉంది. గతంలో వీరికలయికలో చెన్నకేశవరెడ్డి సినిమా వచ్చింది. ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. ఈసారి ఎలాగైనా హిట్ సాధించాలనే కసితో ఉన్నారు. అందుకే ఆసక్తికర టైటిల్ పెట్టినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇదివరకు ఎన్టీఆర్ 104 ప్రాజక్ట్ కి క్రాంతి అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం సాగింది. కానీ తాజాగా ఈ సినిమాకి “ఎకే ౪౭” అనే టైటిల్ ను వినాయక్ ఖరారు చేసినట్లు తెలిసింది. బాలకృష్ణ ఒకే చెప్పగానే ఈ పేరుని రిజిస్టర్ చేయించడానికి సి కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాల వారు చెప్పుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus