వరుసగా ఏడు విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నానికి కృష్ణార్జున యుద్ధం రూపంలో బ్రేక్ పడింది. ఇక లాభం లేదనుకొని నాని రూట్ మార్చారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో ‘జెర్సీ’ సినిమా చేయబోతున్నారు. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. ఇక దీని తర్వాత సినిమా కూడా ఫైనల్ అయింది. ఈ సినిమాతో దిల్ రాజు తన డైరక్టర్ బృందంలో ఒకతన్ని డైరక్టర్ గా పరిచయం చేయబోతున్నారు. అతను చెప్పిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ నిర్మాత దిల్ రాజుకి, నానికి భలే నచ్చిందంట. పైగా ఈ సీజన్లో పొలిటికల్ నేపథ్యంలో సాగె కథలు విజయం సాధిస్తున్నాయి.
తేజ దర్శకత్వంలో వచ్చిన “నేనే రాజు నేనే మంత్రి”, కొరటాల శివ తెరకెక్కించిన “భరత్ అనే నేను” గొప్ప విజయాన్ని అందుకున్నాయి. అలాగే విజయ్ దేవర కొండా కూడా నోటా అనే ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఇది కూడా రాజకీయ నేపథ్యంలో సాగుతుంది. అందుకే అటువంటి కథపై నాని మొగ్గు చూపారు. ఫస్ట్ టైమ్ నాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న ఈ సినిమాకి ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. “సభకు నమస్కారం” అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు టాక్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.