Akhil: అఖిల్-సురేందర్ రెడ్డి సినిమా.. టైటిల్ ఇదేనా..?

అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే మూడు సినిమాలు చేశారు. కానీ ఏదీ కూడా సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది. త్వరలోనే అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ సినిమా మంచి హిట్ అందుకుంటే మాత్రం అఖిల్ కి కాస్త ఉపశమనం కలుగుతుంది. అయితే అక్కినేని ఫ్యాన్స్ దృష్టి మొత్తం ఇప్పుడు సురేందర్ రెడ్డిపైనే ఉంది.

అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా అన్న్స్ చేసినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సురేందర్ రెడ్డి తన సినిమాల్లో హీరోలను చాలా స్టైలిష్ గా సరికొత్త క్యారెక్టరైజేషన్ తో చూపిస్తుంటారు. అఖిల్ ను కూడా అదే రేంజ్ లో చూపిస్తారని.. అఖిల్ కెరీర్ లో ఇదొక గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన, గురువారం నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది చిత్రబృందం.

Once Again Nagarjuna Taking Risk on Akhil1

ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ను కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం ఓ పాత సినిమా టైటిల్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కెరీర్ లో హిట్టు సినిమాల్లో ఒకటిగా నిలిచిన ‘వారసుడు’ సినిమా టైటిల్ ను అఖిల్ సినిమాకి పెట్టబోతున్నట్లు సమాచారం. కథకు కూడా టైటిల్ సరిపోతుందని భావిస్తున్నారు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్ నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus