Balakrishna,Anil Ravipudi: ఆ డైరెక్టర్ పై బాలయ్యకు ఇంత నమ్మకమా?

పటాస్ సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన అనిల్ రావిపూడి వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు నచ్చే, మెచ్చే కథలతో సినిమాలను తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి ఈ ఏడాది ఎఫ్3 సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఎఫ్2 సీక్వెల్ కాకపోయినా ఆ పాత్రలతో తెరకెక్కుతున్న ఎఫ్3 అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది.

Click Here To Watch Now

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తాను నటిస్తున్నానని గతేడాది జూన్ 10వ తేదీన పుట్టినరోజు సందర్భంగా బాలయ్య క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కథ వినకుండానే బాలయ్య ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారని తెలుస్తోంది. తాజాగా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో తమ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదని ఆయన అన్నారు.

ఎఫ్3 రిలీజ్ తర్వాత బాలయ్య సినిమాపై దృష్టి పెడతానని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని బాలయ్యకు కథ చెప్పలేదని అనిల్ రావిపూడి వెల్లడించారు. ఈ సినిమా కోసం మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నామని అనిల్ రావిపూడి అన్నారు. తాను పాన్ ఇండియా సినిమాలు చేయనని పక్కా పైసా వసూల్ సినిమాలు చేస్తానని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఒక సినిమా కోసం ఎక్కువ సమయం గడపడం తనకు నచ్చదని అనిల్ రావిపూడి తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్3 మూవీ ఆలస్యంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలను ఆరు నెలల్లోనే పూర్తి చేస్తానని అనిల్ రావిపూడి వెల్లడించారు. కథ వినకుండానే బాలయ్య ఓకే చెప్పాడని తెలిసి బాలయ్యకు అనిల్ రావిపూడిపై ఇంత నమ్మకమా? అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus