‘మహర్షి’ లేటెస్ట్ అప్డేట్

మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ప్రస్తుతం గ్రామీణ నేపధ్యంలో చోటుచేసుకునే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 10 కోట్ల బడ్జెట్ తో విలేజ్ సెట్ ను వేశారు.

ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయట. దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ సంస్ద కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ బాబు స్నేహితుడి పాత్రలో కామెడీ హీరో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. జగపతి బాబు, సాయి కుమార్ కీలక పత్రాలు పోషించనున్నారట. ఇక ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను భారీ రేటు పెట్టి జెమిని టీవీ దక్కించుకోవడం విశేషం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus