Radhe Shyam Release Date: జక్కన్నకు ప్రభాస్ భారీ షాకిచ్చారా?

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. కొన్ని నెలల క్రితమే రాధేశ్యామ్ మేకర్స్ నుంచి రాధేశ్యామ్ రిలీజ్ డేట్ నుంచి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన వెలువడింది. అయితే ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రిలీజ్ కావచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ రిలీజైనా రాధేశ్యామ్ డేట్ మారదని ఆ సినిమా మేకర్స్ చెబుతున్నారు.

సాధారణంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం రిలీజ్ డేట్ మార్చుకోమని కోరితే ప్రభాస్ నో చెప్పే అవకాశం అయితే లేదు. అయితే రాధేశ్యామ్ సంక్రాంతి సీజన్ ను వదులుకుంటే మరో మంచి డేట్ దొరకడం కష్టం కాబట్టి రాధేశ్యామ్ మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ ను మార్చడానికి ఒప్పుకోవడం లేదు. భీమ్లా నాయక్ మేకర్స్ సైతం తమ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేస్తామని చెబుతుండటం గమనార్హం. మరోవైపు బంగార్రాజు సినిమా కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని తెలుస్తోంది.

సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేస్తే మరో సినిమాతో పోటీ తప్పదు. ఆర్ఆర్ఆర్ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను వెతుక్కుంటారో లేక సంక్రాంతికి తమ సినిమాను విడుదల చేస్తారో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సంక్రాంతి సీజన్ ను మిస్ చేసుకుంటే సమ్మర్ కు ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంటుంది. ప్రభాస్ ఆర్ఆర్ఆర్ విడుదలైనా సంక్రాంతికే తన సినిమాను రిలీజ్ చేస్తూ రాజమౌళికి షాక్ ఇచ్చారనే చెప్పాలి. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ మారనుందని జరుగుతున్న ప్రచారం గురించి మేకర్స్ స్పందించి ఆ ప్రచారంలో నిజం లేదని చెప్పుకొచ్చారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus