Mahesh Babu: మహేష్ మూవీకి టికెట్ రేట్లు పెరుగుతాయట.. కానీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్2 నిర్మాతలు ఏపీలో టికెట్ రేట్లు పెరిగేలా ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. అయితే ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలకు కూడా అదనంగా టికెట్ రేట్లు పెరగబోతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. సాధారణంగా ఏపీలో టికెట్ రేట్లు పెరగాలంటే పెద్ద సినిమాలు కనీసం ఏపీలో 20 శాతం షూటింగ్ ను జరుపుకోవాలి.

Click Here To Watch NOW

అయితే రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు మినహాయింపు లభించిన నేపథ్యంలో తమ సినిమాలకు కూడా మినహాయింపు లభిస్తుందని ఆచార్య, సర్కారు వారి పాట మేకర్స్ భావిస్తున్నారు. సర్కారు వారి పాట ఆంధ్ర హక్కులు 50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ఫస్ట్ వీక్ కు మాత్రమే టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు కావాలని మైత్రీ నిర్మాతలు కోరనున్నారని తెలుస్తోంది. కొంతమేర టికెట్ రేట్లను పెంచి రీజనబుల్ రేట్లకే టికెట్లను విక్రయించాలని మైత్రీ నిర్మాతలు భావిస్తున్నారని బోగట్టా.

ఆచార్య సినిమాకు టికెట్ రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. సర్కారు వారి పాట సినిమా తర్వాత కొంతకాలం పాటు మరీ పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. సర్కారు వారి పాట సినిమాలో లవ్ ట్రాక్ అద్భుతంగా ఉంటుందని మహేష్ కీర్తి సురేష్ కాంబో సీన్లు బాగా వచ్చాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మహేష్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైందని తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమా నుంచి మరో పాట రిలీజ్ కానుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి సరిగ్గా అప్ డేట్స్ ఇవ్వడం లేదని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus