Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ ఇదే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేసే స్టార్ హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కంటే కథకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే హీరోగా తారక్ కు మంచి గుర్తింపు ఉంది. పలు సందర్భాల్లో తారక్ జడ్జిమెంట్ ఫెయిల్ అయినా మెజారిటీ సందర్భాల్లో సినిమాల విషయంలో తారక్ అనుకున్న ఫలితాలను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమాలలో నటిస్తానని ఫ్యాన్స్ కు మాటిచ్చిన ఎన్టీఆర్ ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ లో పాత్రకు అనుగుణంగా బొద్దుగా కనిపించిన తారక్ కొరటాల శివ సినిమాలో స్టూడెంట్ గా కనిపించాల్సి ఉండటంతో స్లిమ్ లుక్ లోకి మారిపోతున్నారు. ఇప్పటికే కొంతమేర బరువు తగ్గిన తారక్ పూర్తిస్థాయిలో బరువు తగ్గాక కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే మూవీ షూట్ మొదలుకానుంది. షూటింగ్ మొదలుకావడం ఆలస్యమవుతున్నా 2023 సంవత్సరం మార్చి లోపు ఈ సినిమా థియేటర్లలో కచ్చితంగా రిలీజవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా రొటీన్ కథతోనే తెరకెక్కినా స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఆది,

సింహాద్రి తరహా గూస్ బంప్స్ తెప్పించే సీన్లతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ కాగా ఆ పోస్టర్ లో తారక్ ఊరమాస్ లుక్ లో కనిపించారు.

అయితే ఈ సినిమాలోని మరో రోల్ లో తారక్ క్లాసీ లుక్ లో కనిపిస్తారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. ఏడాదికి కనీసం ఒక మూవీ రిలీజయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న తారక్ తర్వాత సినిమాలతో ఇతర రాష్టాల్లో, విదేశాల్లో క్రేజ్ మరింత పెరిగే విధంగా జాగ్రత్త పడుతున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus