Tollywood: కుర్రకారును మెప్పించడానికి టాలీవుడ్‌ ఓవర్సీస్‌ ప్రయత్నాలు!

ప్రతి శుక్రవారం ఒక సినిమా ఎలా అయితే వస్తుందో, అలానే కొత్త హీరోయిన్‌ కూడా రావాలి అంటుంటారు మన టాలీవుడ్‌ ప్రేక్షకులు. అందుకే ఎప్పుడు చూసినా మన తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త అందాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మన దర్శకనిర్మాతలు తెలుగు రాష్ట్రాలు దాటి, పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పక్క దేశాలకు కూడా వెళ్తున్నారు. అలా ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాలో బయటి దేశాల ముద్దుగుమ్మలు కనిపించబోతున్నాయి.

Click Here To Watch NOW

టాలీవుడ్‌లో బయటి దేశాల అమ్మాయిలను చూపించడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది కథానాయికలు ఇలా నటించి మెప్పించారు కూడా. అలా ‘మల్లీశ్వరి’తో కత్రినా కైఫ్‌, ‘కరెంటు తీగ’తో సన్నీలియోన్‌, ‘ఎవడు’తో అమీ జాక్సన్‌, ‘తిక్క’తో లారిస్సా బోనేసి లాంటి విదేశీ నాయికలు తెలుగు చలన చిత్ర సీమలో కనిపించారు. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఒలీవియా మోరిస్‌ కూడా అలా ఆకట్టుకున్న అమ్మడే. ఇక రాబోయే సినిమాల్లో ఇలా ఎవరు వస్తున్నారో చూస్తే… వీళ్లు కనిపిస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ – క్రిష్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’లో నర్గిస్‌ ఫక్రీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమె ఇప్పటికే కొన్ని బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. తమిళ హీరో శివ కార్తికేయన్‌తో ‘జాతి రత్నాలు’ అనుదీప్‌ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఉక్రెయిన్‌ సుందరి మరియా ర్యాబోషప్కా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే రెండు ఉక్రెయిన్‌ సినిమాల్లో నటించిన మరియా, ఇటీవల ‘స్పెషల్‌ ఓప్స్‌’ అనే భారతీయ వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది.

నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’తో షిర్లీ సేథియా అనే చిన్నది తెలుగు తెరకు పరిచయమవుతోంది. భారత్‌లోని డామన్‌లో పుట్టిన షిర్లీ న్యూజిలాండ్‌లో పెరిగింది. అక్కడే గాయనిగా కెరీర్‌ను ప్రారంభించి, హిందీ సినిమా ‘మస్కా’తో నటిగా మారింది. ఇప్పుడు ‘కృష్ణ వ్రింద విహారి’లో నాగశౌర్యతో కలసి ఆడిపాడింది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అలా మన హీరోల పక్కన విదేశీ భామలు నటిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus