మండుటెండలో షూటింగ్ కోసం రోడ్లపై పరుగులు పెట్టిన బుల్లితెర నటి?

సాధారణంగా సెలబ్రిటీలు తెరపై ఎంతో సరదాగా ప్రేక్షకులందరినీ నవ్విస్తూ సందడి చేస్తున్నప్పటికీ, తెర వెనుక ఎంతో కష్టం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. రాత్రి పగలు అనే తేడా లేకుండా మండుటెండల్లో సైతం షూటింగ్ కోసం పరుగులు పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా తెరవెనుక సెలబ్రిటీల కష్టం ఎంతో ఉంటుందనే చెప్పాలి.ఈ క్రమంలోనే బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రశాంతి ప్రస్తుతం బుల్లితెర సీరియల్ లో విలన్ పాత్ర ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే యాంకర్ ప్రశాంతి ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్లో లాస్య పాత్ర ద్వారా తన విలనిజంతో అందరినీ భయపెడుతున్నారు. ఇకపోతే షూటింగ్ల పరంగా ఎంతో బిజీగా ఉండే ప్రశాంతి విరామ సమయంలో లొకేషన్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె షూటింగ్ లొకేషన్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సీరియల్ షూటింగ్ లో భాగంగా మండుటెండలో దర్శకుడు ఈమె చేత రోడ్లపై పరుగులు పెట్టించారు. ఇలా ఎండలో పరుగులు పెట్టే సరికి లాస్యకు దిమ్మతిరిగిపోయినట్టుంది ఏసీ లేదు కదా? అని అంటే.. నువ్ ఉన్నావ్ కదా? అంటూ పక్కనే ఉన్న ఆటోలో ఎక్కి కూర్చున్నారు. ఇక లాస్యతోపాటు దివ్య కూడా సందడి చేసినట్లు తెలుస్తోంది. ఇలా తన సీరియల్ షూటింగ్ కి సంబంధించిన కష్టాలను ప్రశాంతి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

కెరియర్ మొదట్లో యాంకర్ గా తన ప్రస్థానం కొనసాగించిన ఈమె యాంకర్ కంటే ఇలా బుల్లి తెరపై నటిగా విలన్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసిన ఈమెకు మరిన్ని సీరియల్ అవకాశాలు వస్తున్నాయి. ఇకపోతే విలన్ పాత్రలకి ఎంతో కరెక్టుగా సూట్ అవుతూ తను తప్ప ఆ పాత్రలో ఎవరిని ఊహించుకోలేము అనేలా ప్రశాంతి నటిస్తూ సందడి చేస్తున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus