టాలీవుడ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్…అవును మెగాస్టార్ టాలీవుడ్ ను వీడి వెళ్ళి దాదాపుగా 10ఏళ్లు అవుతున్నా…ఆ ప్లేస్ ను ఇప్పటివరకూ ఎవరూ భర్తీ చెయ్యలేదు అని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మన గమనించాల్సిన విషయం ఏమిటంటే….టాలీవుడ్ లో టాప్ ప్లేస్ అంటూ ఏమీ ఉండదు. ప్రతీ హీరోకి తన స్టామినాకి తగ్గట్టు హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి. ఇక అదే క్రమంలో నిన్న విడుదలయిన చిరు 150 వ సినిమా పోస్టర్ చూడగానే ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు మెగా ఫ్యాన్స్. అదే క్రమంలో ఈ సినిమా గురించి ఎన్నో విషయాలు టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతూ మనకు తెలిసీ తెలియనట్లుగా ఉంటున్నాయి….అవేమిటో ఒక లుక్ వేద్దాం రండి…టాలీవుడ్ లో ఎక్కువ శాతం హీరోలకు సొంత బ్యానర్స్ ఉన్నాయి.
అయితే మెగా ఫ్యామిలీకి సంభందించినంతవరకూ గీత ఆర్ట్స్ పక్కన పెడితే, నాగబాబు ఆంజనా ప్రొడక్షన్స్ చిరు సొంత బ్యానర్ గా అనుకుంటాడు. అదే క్రమంలో ఇప్పుడు అనుకోకుండా కొణిదెల ప్రొడక్షన్స్ కి శ్రీకారం చుట్టాడు మెగా పవర్ స్టార్ రామ్చరణ్. ఇంతకీ ఎందుకలాగా, ఎవరు ఈ నిర్ణయానికి కారణం అంటే….ఇదంతా భార్య ఉపాసన ఇనీషియేటివ్ అని తెలుస్తోంది. ముంబయ్ లో ప్రతీ హీరోకూ సొంతంగా ఒక బ్యానర్ ఉంది. అలాగే వారు ఇతరులతో కూడా సినిమాలు తీస్తుంటారు. అదంతా డబ్బులు సంపాదించడానికే అని కాదు.. కాకపోతే బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి. అందుకే ఇప్పుడు చరణ్ తో ఈ కొత్త కంపెనీ స్టార్ట్ చేయించి.. ఇక మీదట ఈ బ్యానర్ పై చాలా సినిమాలు తీయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అదే క్రమంలో ముందు నుంచి అనుకుంటున్నట్లు ఈ సినిమాని మెగా ఫ్యామిలీ ఒక్కటే నిర్మించలేదు…తమిళ కత్తి తీసిన లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు సైతం సహ నిర్మాతలుగా ఉన్నారు అందుకే ప్రతీ పోస్టరుపై ‘ఇన్ అసోసియేషన్ విత్ లైకా’ అనే లోగోను కూడా ప్రింట్ చేశారు. ఇక కధ కధనం విషయం తీసుకుంటే ఈ సినిమాకి ఎంతో మంది రైటర్స్ పనిచేసినట్లు గాసీపా వినిపించాయి కానీ, ఈ సినిమాకి పనిచేసింది పరుచూరి సోదరులు మాత్రమే అని పోస్టర్ లో పేరు స్పష్టంగా చెబుతుంది. మొత్తానికి మనకు తెలియని, తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఈ పోస్టర్ వివరించింది అనే చెప్పాలి.