ఈ 60 రోజుల్లో మన స్టార్ హీరోలు.!

ఇండియాలోనే మోస్ట్ కాస్ట్లీయస్ట్ ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ కూడా “ఐ.పీ.ఎల్” సీజన్ మొదలైందంటే.. తమ సినిమాల విడుదల విషయంలో జాగ్రత్తపడుతుంటారు. ప్రతి సీజన్ కు స్ట్రాంగ్ అవుతూ అన్ని ఇండస్ట్రీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఐ.పీ.ఎల్ కు ఈ ఏడాది పోటీ ఇచ్చేందుకు మన తెలుగు చిత్రసీమ సిద్ధమవుతోంది. అది కూడా అన్నీ భారీ సినిమాలతోనే. మరి ఐ.పీ.ఎల్ కి పోటీనిస్తున్న మన తెలుగు స్టార్ హీరోలెవరూ, ఏమిటా సినిమాలు అనేది చూద్దాం.

ముందుగా మహేష్ క్రీజ్ లో నిలవనున్నాడు. ఏప్రిల్ 20న “భరత్ అనే నేను” అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్రెడీ ఓవర్సీస్ లో భారీస్థాయి బుకింగ్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మహేష్ కంటే ముందు ఏప్రిల్ 12న “కృష్ణార్జున యుద్ధం”తో ప్రేక్షకులని పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు నాని. అనంతరం ఏప్రిల్ 27న రజనీకాంత్ “కాలా”గా రావాలనుకొన్నాడు కానీ.. తమిళనాట ఇండస్ట్రీ బంద్ జరుగుతున్న కారణంగా సినిమా విడుదలలో ఇంకా క్లారిటీ రాలేదు. ఆ తర్వాత మే 4న అల్లు అర్జున్ “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా”తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. బన్నీ తర్వాత రవితేజ “నేల టికెట్తో మే 24న మాస్ ఆడియన్స్ పలకరించడానికి రవితేజ సిద్ధమవుతున్నాడు. అలాగే నాగార్జున “ఆఫీసర్”, నాగచైతన్య “సవ్యసాచి”, గోపీచంద్ “పంతం” కూడా ఈ ఐ.పీ.ఎల్ సీజన్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే.. ఒక సినిమా చూడడానికి కుటుంబం మొత్తం వెళ్లాలంటే కనీసం 1500 ఖర్చు అవుతుంది. ఇక ఇంటర్వెల్లో పొరపాటను ఏమైనా తినాలనుకుంటే ఖర్చు వేలల్లో ఉంటుంది. అదే ఐ.పి.ఎల్ మ్యాచ్ లైతే ఇంట్లో టీవీలో లేదా ఇంటర్నెట్ ఉంటే ల్యాప్ టాప్, ముబైలో ఎలాంటి ఖర్చు లేకుండా చూసుకోవచ్చు. ఎంటర్ టైన్మెంట్ తోపాటు బోలెడంత మజా. అందుకే ఐ.పి.ఎల్ ను ప్రజలు ప్రిఫర్ చేస్తారు. అయితే.. ఈ వేసవిలో మన స్టార్ హీరోలందరూ ముందుకు రావడంతో ప్రేక్షకుల్ని థియేటర్ల వరకూ తీసుకురావడం వరకూ ఒకే.. థియేటర్లో ఎంతవరకూ అలరిస్తారు అనేది పెద్ద ప్రశ్న. మరి ఈ రసవత్తరమైన పోటీలో ఎవరు నెగ్గుతారో చూద్దాం..!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus