‘సలాం బాంబే’ చిత్రంతో నటుడుగా ఎంట్రీ ఇచ్చి పెద్ద క్రేజీ నటుడు అయ్యాడు ఇర్ఫాన్ ఖాన్. ఏప్రిల్ 29 న(నిన్న) ఆయన మరణించాడు. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మహేష్ బాబు- గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ‘సైనికుడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. అయితే ఆ చిత్రం ప్లాప్ అవ్వడంతో తరువాత ఈయనకి తెలుగులో ఎక్కువగా అవకాశాలు రాలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూ వచ్చాడు.
విలక్షన నటుడు అనే బిరుదును కూడా పొందాడు. అయితే 2018 లో ఈయన క్యాన్సర్ బారిన పడడంతో… ఈయన సినీ కెరీర్ కు బ్రేక్ పడింది. ట్రీట్మెంట్ కోసం ఈయన లండన్ కు వెళ్ళాడు. ఈయనకి వచ్చినా క్యాన్సర్ పేరు ‘న్యూరో ఎండ్రోకిన్ ట్యూమర్’ అట. ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమా కోసం మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చిన ఇర్ఫాన్ అది పూర్తయ్యాక మళ్ళీ లండన్ కు వెళ్ళి వచ్చాడు. ఆ టైములో కోలుకున్నట్టే కనిపించాడు ఇర్ఫాన్.
తన భార్య సుతాప సిఖ్దర్… ఇర్ఫాన్ అనారోగ్యంతో ఉన్నప్పుడు.. అతను కోలుకోవాలి అని ఎంతో తపన పడింది. సేవ చేసిందట. తన భార్య కోసమైనా బ్రతుకుతాను అంటూ ఇర్ఫాన్ చెప్పాడట. మీడియాతో కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్. కానీ ఇంతలో ఇలా అయిపొయింది అంటూ అతని భార్య కన్నీళ్ళు పెట్టుకుంటుందని తెలుస్తుంది.
Most Recommended Video
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!