ఫిట్‌నెస్ ట్రైనర్‌తో స్టార్ హీరో కూతురి సీక్రెట్ అఫైర్.. ఫామ్‌హౌస్‌లో సన్నిహితంగా!

  • November 26, 2020 / 08:16 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆమిర్ ఫిట్ నెస్ కోచ్ నుపూర్ శిఖరేతో ఆమె ప్రేమలో పడినట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఇరా ఖాన్.. మిషాల్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. తన ప్రేమకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. రెండేళ్లపాటు అతడిని ప్రేమించిన ఇరా.. గతేడాది ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తరువాత ఇరా.. నుపూర్ తో ప్రేమలో పడినట్లు సమాచారం.

నుపూర్ గత కొన్నేళ్లుగా ఆమిర్ కు పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉంటున్నారు. లాక్ డౌన్ నుండి ఆయన ఇరా ఫిట్ నెస్ పై కూడా శ్రద్ధ పెడుతూ తనకు కోచ్ గా మారారు. ఈ క్రమంలో నుపూర్ వ్యక్తిత్వం నచ్చడంతో ఇరా అతడితో ప్రేమలో పడినట్లు సమాచారం. తన ప్రేమ విషయాన్ని తల్లి రీనాదత్తాకు చెప్పి.. నుపూర్ ని పరిచయం కూడా చేసినట్లు బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. వీరిద్దరూ కొద్దిరోజులు మహాబలేశ్వరంలోని ఆమిర్ ఫామ్ హౌస్ లో కలిసి ఉన్నారని.. అక్కడే దీపావళి పండుగ కూడా జరుపుకున్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus