సినిమా ప్రచారం కోసం ఎంత చేసినా తక్కువే… ఇప్పుడు సినిమా జనాలు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. అందుకే దొరికిన అన్ని ఛాన్స్‌లను వాడుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు పరిధి దాటేసి, ఎమోషన్లతో ఆడుకుంటున్నారు. అభిమానులు అవ్వొచ్చు, ప్రేక్షకులు అవ్వొచ్చు.. ఎవరివైనా ఎమోషన్లు ఎమోషన్లే కదా. అలాంటి వాటిలో గేమ్స్ ఆడి దొరికిపోయి చివాట్లు తింటున్నారు. తాజాగా ఓ తమిళ సినిమా టీమ్ ఇలానే చేసి ఇబ్బందిపడింది.
చిన్న సినిమాల కోసం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం కష్టం అయిపోతోంది. దీని కోసం ప్రచారంలో కొత్త పంథాను తీసుకొస్తున్నారు. కొందరు డైరెక్ట్ ప్రచారం చేస్తుంటే.. ఇంకొందరు సోషల్ మీడియాను నమ్ముకుంటున్నారు. అలా ‘రెజీనా’ అనే ఓ తమిళ సినిమా టీమ్ కొత్తగా ట్రై చేసి దెబ్బతింది అని చెప్పొచ్చు. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడానికి ఆ చిత్ర బృందం చేసిన పని విమర్శలకు దారి తీసింది.
యువ కథానాయిక సునైనా లీడ్ రోల్ చేస్తున్న ఓ సినిమా కోసం ప్రచారం ప్రారంభించారు. ఈ సినిమా అంతా కిడ్నాప్ నేపథ్యంలో సాగుతుందట. దీంతో సినిమా ప్రచారం కోసం ‘సునైనా కిడ్నాప్’ అయ్యిందని నాటకం ప్రారంభించారు. ఆమె సన్నిహితులు, బంధువులకు ఈ మేరకు మెసేజ్‌లు చేశారు. సునైనా కిడ్నాప్ అయినట్లుగా వార్తను లీక్ చేశారు. ఈ విషయం తెలిసి సన్నిహితులు, అభిమానులు ఆమెకు ఫోన్ చేయడానికి ట్రై చేయగా.. నంబర్ రెండు రోజుల పాటు స్విచాఫ్‌లో ఉంది.
దీంతో హీరోయిన్ (Actress) సునైనాను ఎవరో కిడ్నాప్ చేశారంటూ కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. చివరికి చూస్తే ఇదంతా సినిమా ప్రమోషన్‌లో భాగమని తేలింది. నేను సేఫ్‌గానే ఉన్నానని.. ఇదంతా సినిమాలో హీరోయిన్ పాత్ర ఇంటెన్సిటీని చూపించడానికి టీమ్ చేసిన ప్రయత్నం అని చెప్పారు. దీంతో టీమ్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రమోషన్ల కోసం మరీ ఇంత డ్రామా నడిపించాలా… మా మనోభావాలతో ఆడుకోవాలా అనే వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు