ఇటీవల టి.సుబ్బిరామిరెడ్డి.. 2017-2018 చిత్రాలకి సంబంధించి ‘టి.ఎస్.ఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్స్’ ను ప్రకటించారు. ఎప్పటిలాగే.. ఈసారి కూడా ఏదో ఒక కేటగిరి పేరు చెప్పి అందరికీ అందరికీ అవార్డులు ఇచ్చేసాడు. ఇందులో ఒక్క ఎన్టీఆర్ కి తప్ప అందరి హీరోలకూ అవార్డులు ఇచ్చాడు సుబ్బిరామి రెడ్డి. అయితే అసలు ఎన్టీఆర్ కి అవార్డు ఇవ్వకపోవడానికి అసలు కారణం ఏంటి..? అనేదాని పై ఫిలింనగర్లో చర్చ మొదలయ్యింది.
విషయాన్నీ పరిశీలిస్తే 2017 సంవత్సరానికి గానూ నందమూరి బాలకృష్ణ కి ఉత్తమ నటుడు కేటగిరిలో అవార్డు కట్టబెట్టారు. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రానికి గానూ ఈ అవార్డు బాలకృష్ణకి ఇచ్చారని సమాచారం. అయితే జూ.ఎన్టీఆర్‌కి కూడా అవార్డు ఇస్తే… నందమూరి బాలకృష్ణ ఈ ఫంక్షన్‌కి వస్తాడా అనే డౌట్ తో సుబ్బిరామిరెడ్డి ఇలా చేసాడని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు. నందమూరి హరికృష్ణ మరణం తరువాత బాలయ్య – ఎన్టీఆర్ కలిసిపోయారని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్ర విజయోత్సవ సభకి బాలయ్య హాజరయ్యాడు. ఇక ఎన్టీఆర్ – కథానాయకుడు ఫంక్షన్‌కి కూడా తారక్ హాజరయ్యాడు. దీంతో వారిరువురు కలిసిపోయారని అంతా అనుకున్నా…. అది తాత్కాలికంగానే అని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ కారణంతోనే సుబ్బిరామిరెడ్డి అవార్డులకి ఎన్టీఆర్ పేరు వినిపించలేదని తెలుస్తుంది. బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ పై కూడా తారక్ ఎక్కడా స్పందించలేదు. దీనిని బట్టి చూస్తే అది నిజమేనేమో అనే సందేహం కలుగకుండా ఉండదు.. అనడంలో సందేహం లేదు.