Allu Arjun: ఆ సినిమా డబ్బులే కొరటాల ఎన్టీఆర్‌కు పెడుతున్నాడా?

Ad not loaded.

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అనే సామెత మీకు తెలుసు కదా. దానికి నేటి పరిస్థితికి ఆపాదిస్తే ‘తారక్‌ సినిమా బన్నీ సినిమా మీదకొచ్చింది’ అనాలేమో. ఎందుకంటే #NTR30 సినిమా ప్రకటన ఇప్పుడు టాలీవుడ్‌లో మరో చర్చకు దారి తీసింది. త్రివిక్రమ్‌ సినిమా ఎందుకు ఆగిపోయింది అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇంకా దొరక్క ముందే, అల్లు అర్జున్‌ సినిమా ఉంటుందా అనే ప్రశ్న మొదలైంది. అల్లు అర్జున్‌ – కొరటాల కాంబోలో ఓ సినిమా ఉంటుందని గతంలో ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చర్చ ఆ సినిమా గురించే.

రాజకీయం నేపథ్యంలో అల్లు అర్జున్‌తో కొరటాల సినిమా చేస్తారని కొన్ని నెలల క్రితం ప్రకటన వచ్చింది. యువ సుధ ఆర్ట్స్‌, జీఏ2 పిక్చర్స్‌ ఆ సినిమాను నిర్మిస్తాయని ప్రకటించారు. ‘పుష్ప’ పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కిస్తారని చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు కొరటాల.. ఎన్టీఆర్ సినిమా పనిలో పడ్డాడు. జూన్‌లో సినిమా పనులు మొదలవుతాయని చెప్పారు. దీంతో అల్లు అర్జున్‌ సినిమా లేనట్లే అంటూ వార్తలొస్తున్నాయి. ఆ సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువ సుధ .. ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమాకు నిర్మాతగా ఉండటం ఒక కారణమైతే… ఎన్టీఆర్‌ సినిమా కూడా రాజకీయం నేపథ్యంలోనే ఉంటుందని వార్తలు రావడం మరో కారణం.

బన్నీతో అనుకున్న కథనే ఎన్టీఆర్‌తో కొరటాల చేస్తున్నాడా అనే పుకార్లు మొదలయ్యాయి. అయితే అల్లు అర్జున్‌ సినిమా ఉంటుందని యువ సుధ ఆర్ట్స్‌ ట్వీట్‌ చేసింది. అయితే ఇది అభిమాను ఆగ్రహాన్ని తగ్గించడానికి చేసిన ట్వీట్‌లా కనిపిస్తోందని సినీ పరిశీలకుల అంచనా. ‘పుష్ప’ అయ్యాక బన్నీ ఏం చేస్తాడనే దానిపైనే ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడుతుంది. త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా చేస్తాడని కొందరు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే… ఎన్టీఆర్‌ను కాదని గురూజీ బన్నీవైపు వచ్చాడని అనుకోవచ్చు. ఇలాంటి ఊహలు, పుకార్లు అంతమంచివి కావు… కాబట్టి ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే బాగుండు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus