‘ఎంగేజ్డ్’ అంటూ ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఆ ఫోటోలో ఆమె వేలికి ఉంగరం ఉండడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. అయితే ఫోటోలో ఓ పాప కూడా ఉంది. ఆ పాప అనుపమ వేలికి ఉంగరం తొడిగినట్టు కనిపిస్తుండడం విశేషం! దానిని బట్టి చూస్తుంటే..ఆ పాపతో సరదాగా రింగ్ ఆట ఆడుకుంటుందని స్పష్టమవుతుంది.కానీ ఎంగేజ్డ్ అని పెట్టి.. ఆమె అభిమానులను టెన్షన్ పెట్టేసింది.
గతంలో కూడా అనుపమ ఓ క్రికెటర్ తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయినా ఈ బ్యూటీ ఇప్పట్లో పెళ్లి చేసుకోనని ఆల్రెడీ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. తన వయసు కేవలం 24ఏళ్లే అని.. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమా కెరీర్ పైనే ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక 2019లో ‘రాక్షసుడు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన అనుపమ.. ఆ తరువాత మళ్ళీ తెలుగులో సినిమా చెయ్యలేదు.
మొన్నామధ్య నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో అవకాశం దక్కించుకుందని కథనాలు వినిపించాయి కానీ వాటి పై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇక ఎక్కువగా ఈ అమ్మడు ఖాళీగా ఉండడంతో.. గతేడాది ఓ మలయాళ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది.అంతేకాకుండా డైరెక్టర్ గా కూడా మారడానికి ట్రై చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి !
Most Recommended Video
వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!