Anushka: చిరంజీవి కొత్త సినిమాలో అనుష్క.. నిజమెంత? సాధ్యాసాధ్యాలేంటి?

  • September 20, 2023 / 12:13 PM IST

చిరంజీవి – మల్లిడి వశిష్ట సినిమాకు హీరోయిన్‌ ఇంకా ఫైనల్‌ కాలేదు. చాలా రోజులుగా ఎంపిక ప్రక్రియ జరుగుతోంది అని వార్తలు వస్తున్నాయి. ఇదిగో, అదిగో అంటూ కొన్ని పేర్లు వినిపించినా… ఇంకా ఎవరూ ఓకే కాలేదని టాక్‌. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం వినిపిస్తున్న పేర్లలో అనుష్క శెట్టి వచ్చి చేరింది. ఇటీవల ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన అనుష్క… తర్వాతి సినిమా చిరంజీవితో చేస్తోందని టాక్‌ నడుస్తోంది.

చిరంజీవి 157వ సినిమాగా ఓ జగదేక వీరుని కథను తెరకెక్కిస్తారనే టాక్‌ చాలా రోజులుగా నడుస్తోంది. అనుకున్నట్లుగానే ఈ సినిమా పోస్టర్‌లో ఆ వైబ్స్‌ చూపించారు. ఈ కథ చిరంజీవికి బాగా నచ్చిందని, ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్న సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయనేది మెగా వర్గాల సమాచారం. ఇప్పుడు అదే వర్గాల నుండి మరో సమాచారం బయటకు వచ్చింది. అదే ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్కను ఎంపిక చేస్తున్నారు అని.

నిజానికి ‘భోళా శంకర్‌’ సినిమా తర్వాత చిరంజీవి – కల్యాణ్‌ కృష్ణ సినిమా మొదలవ్వాలి. అయితే రీమేక్‌ల విషయంలో చిరంజీవి నిర్ణయం మారడంతో ఆ ప్రాజెక్ట్‌ పక్కకు వెళ్లి… యూవీ క్రియేషన్స్‌ – వశిష్ట సినిమా ముందుకొచ్చింది. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు దాదాపుగా పూర్తయ్యాయట. నవంబరు నుండి సినిమా చిత్రీకరణ అంటున్నారు. ఈలోపు కథానాయిక ఎంపిక, ప్రకటన రెండూ అయిపోతాయట. చిరు సరసన సీనియర్‌ నాయిక బెటర్‌ అని అనుష్కను అడిగారని చెబుతున్నారు.

మరోవైపు అనుష్క (Anushka) ఇటీవల కాలంలో యూవీ క్రియేషన్స్‌ సినిమాలకే ఎక్కువగా ఓటేస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి సినిమాను ఆమె ఓకే చేయొచ్చు అంటున్నారు. కొన్నేళ్ల క్రితం ‘స్టాలిన్‌’ సినిమాలో చిరు – అనుష్క ఓ పాటలో ఆడిపాడారు. ఆ తర్వాత ఇద్దరి కాంబినేషన్‌ కుదర్లేదు. ఇప్పుడు కుదిరితే, అనుష్క అప్పటిలా మారితే ఫ్యాన్స్‌ ఫుల్ హ్యాపీస్‌ అని చెప్పొచ్చు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus