Anushka: అనుష్క అక్కడ కూడా ఎంట్రీ ఇస్తోందా..?

కరోనా మహమ్మారి విజృంభణ తరువాత థియేటర్లు మూతబడటంతో డిజిటల్ సినిమాల హవా పెరిగింది. ఓటీటీల కోసమే ప్రత్యేకంగా భారీ బడ్జెట్లతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే కాజల్, సమంత, తమన్నా, మరి కొంతమంది హీరోయిన్లు ఓటీటీల కోసమే తెరకెక్కిన సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించారు. స్టార్ హీరోయిన్ అనుష్క కూడా ఓటీటీల కోసం తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లలో నటించనున్నారని తెలుస్తోంది. గతేడాది రిలీజైన నిశ్శబ్దం సినిమా ఫ్లాప్ కావడంతో అనుష్క సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

నవీన్ పోలిశెట్టితో నటించే సినిమాకు మినహా మరే సినిమాకు అనుష్క కమిటవలేదు. అనుష్క నటించిన సినిమాల్లో ఫ్లాపైన సినిమాల కంటే హిట్టైన సినిమలే ఎక్కువగా ఉన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం అనుష్కను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. స్వీటీ వెబ్ సిరీస్ లలోకి నిజంగా ఎంట్రీ ఇస్తారా..? లేదా..? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. డిజిటల్ ఫ్లాట్ ఫాంలోకి అనుష్క ఎంట్రీ ఇస్తే మాత్రం జేజమ్మ ఇక్కడ కూడా సక్సెస్ అవుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క నటిస్తున్న సినిమా ప్రయోగాత్మక సినిమా అని ప్రచారం జరుగుతోంది. నవీన్ పోలిశెట్టి తెలుగులో నటించిన సినిమాలు హిట్టైన సంగతి తెలిసిందే. నవీన్ అనుష్క కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus