మహేష్ సినిమా కాపీ..?

మ‌హేష్‌బాబు – శ్రీ‌కాంత్ అడ్డాల బ్ర‌హ్మోత్స‌వం పై ఇప్పుడొక ఆస‌క్తిక‌ర‌మైన రూమ‌ర్‌చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈసినిమా కాపీ క‌థ అట‌. ఎనిమిదేళ్ల క్రితం వ‌చ్చిన పెళ్లైన కొత్త‌లో సినిమాకీ, బ్ర‌హ్మోత్సవం సినిమాకీ కొన్ని పోలిక‌లు ఉన్నాయ‌ట‌. మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం పెళ్ల‌యిన కొత్త‌లో. జ‌గ‌ప‌తిబాబు, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించారు. ఇందులో జ‌గ‌ప‌తి, ప్రియ‌మ‌ణికుల పెళ్ల‌వుతుంది. ఇగో స‌మ‌స్య‌ల‌తో దూరంగా ఉంటారు.

వాళ్ల‌ని పెద్ద‌లు ఎలా క‌లిపారు?  అన్న పాయింట్ చుట్టూ.. పెళ్ల‌యిన కొత్త‌లో న‌డుస్తుంది. బ్ర‌హ్మోత్స‌వం పాయింట్ కూడా అదేన‌ట‌. మ‌హేష్‌, సమంత‌ల పెళ్లితో ఈ సినిమా మొద‌ల‌వుతుంద‌ట‌. వాళ్ల ఈగో స‌మ‌స్య‌ల చుట్టూ క‌థ న‌డుస్తుంద‌ట‌. కుటుంబం మొత్తం ఆ జంట‌ని ఎలా క‌లిపార‌న్న‌దే ఈ సినిమా క‌థ అని తెలుస్తోంది. మ‌రి అదెంత వ‌ర‌కూ నిజ‌మో తెలియాలంటే.. బ్ర‌హ్మోత్స‌వం వ‌చ్చేంత వ‌ర‌కూ ఆగాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus