Boyapati Srinu: అఖండ 2: బోయపాటి మళ్ళీ అదే తప్పు చేయారుగా..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో బోయపాటి శ్రీను (Boyapati Srinu) ఒకరు. ఈ మాస్ డైరెక్టర్ బాలయ్యాతో  (Nandamuri Balakrishna)  ఎలాంటి సినిమా చేసినా కూడా హిట్ గ్యారెంటీ అని ఇప్పటికే మూడు సినిమాలతో క్లారిటీ వచ్చింది. అఖండ (Akhanda)  అనంతరం బాలకృష్ణ తో ఇప్పుడు అఖండ 2: తాండవం చిత్రానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈసారి కూడా బడ్జెట్ విషయంలో బోయపాటి తప్పులు చేస్తాడా అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.

Boyapati Srinu

కెరీర్ మొదటి నుంచి కూడా ఈ దర్శకుడు యాక్షన్ సీన్లపై ఎక్కువ ఖర్చు చేయిస్తారనే పేరుంది. మొదటి నుంచి ప్లాన్‌ చేసిన బడ్జెట్‌లో సినిమాలను ఫినిష్ చేయడం లేదు. ఎంతో కొంత పెరిగుతూనే ఉంటుంది. ఇక అఖండ సినిమా సమయంలో కూడా బడ్జెట్ సమస్యలు ఎదురైనప్పటికీ, ప్రాఫిట్ షేర్ మాట్లాడుకోవడం ద్వారా వ్యవహారం పెద్దది కాలేదు. బాలయ్యతో అఖండ సక్సెస్ కావడం వలన ఆ చిత్రానికి మంచి ఫలితం దక్కింది.

కానీ ఈ సారి 100 కోట్ల బడ్జెట్‌ తో అఖండ 2 రూపొందుతోంది. బాలయ్య కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా కావడం విశేషం. ఇప్పటివరకు బోయపాటి సినిమాల విషయంలో బడ్జెట్ పెరిగిపోవడంపై బాలయ్య కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ అఖండ 2 నిర్మాణ విషయంలో మాత్రం బాలయ్య స్వయంగా ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యారని సమాచారం.

ఈసారి ఆయన కూతురు సమర్పణలో వస్తున్నందున ముందుగానే ఖర్చులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో బోయపాటి కూడా ఈసారి లైన్ దాటకుండా, పెట్టిన బడ్జెట్‌లోనే ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. మరి ప్లాన్ కు తగ్గట్టుగా సినిమా పనులు కొనసాగుతాయో లేదో చూడాలి.

అనుపమ పరమేశ్వరన్‌ ‘డ్రాగన్‌’ అయితే.. మరి తారక్‌ – నీల్‌ సినిమా ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus