అనుపమ పరమేశ్వరన్‌ ‘డ్రాగన్‌’ అయితే.. మరి తారక్‌ – నీల్‌ సినిమా ఏంటి?

తారక్‌  (Jr NTR)  – ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel)  కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలో సినిమా మొదలవుతుంది అని అంటున్నారు కూడా. ఈ సినిమా ఫలానా టైటిల్‌ అని టీమ్‌ చెప్పలేదు కానీ.. పుకార్ల ప్రకారం అయితే ‘డ్రాగన్‌’ అని పెడుతున్నారు అని తెలిసింది. దీంతో ఆ మధ్య ఈ సినిమా కోసం గతంలో టీమ్‌ రిలీజ్‌ చేసిన డార్క్‌ లుక్‌కి ‘డ్రాగన్‌’ అనే ఓన్‌ టైటిల్‌ పెట్టి ఫొటోలు వైరల్‌ చేశారు కూడా.

Jr NTR, Prashanth Neel

కట్‌ చేస్తే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ఆ టైటిల్‌తో మరో సినిమా బయటకు వచ్చింది. ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) సినిమాతో కుర్రకారుని కిర్రెక్కించిన అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కొత్త సినిమాల స్పీడ్‌ పెంచింది. తమిళ యువ కథానాయకుడు ప్రదీప్‌ రంగనాథన్‌తో (Pradeep Ranganathan) ‘డ్రాగన్‌’ అనే సినిమా చేస్తోంది. ‘ఓ మై కడవులే’ సినిమా ఫేమ్‌ అశ్వత్‌ మరిముత్తు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అధికారికంగా ఫస్ట్‌లుక్‌తో అనౌన్స్‌ చేసింది టీమ్‌.

తారక్‌ – నీల్‌ సినిమా పాన్‌ ఇండియా రేంజిలో తెరకెక్కనుంది. కాబట్టి తమిళంలోనూ రిలీజ్‌ చేస్తారు. ఇప్పుడు వీళ్లు ‘డ్రాగన్‌’ అని పేరు పెట్టేశారు. కాబట్టి తారక్‌కు ఆ టైటిల్‌ దొరకదు. కేవలం తమిళం కోసం వేరే పేరు పెట్టరు. కాబట్టి పూర్తి స్థాయిలో టైటిల్‌ మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ సినిమా టీమ్‌ ఈ టైటిల్‌ను అనుకోకపోయి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు.

ప్రశాంత్‌ గత సినిమాల కాన్సెప్ట్‌ ప్రకారం చేస్తే మూడు అక్షరాల టైటిల్స్‌ అందులోనూ అన్ని భాషల్లో ఒకేలా ఉండే టైటిల్స్‌ పెడుతూ ఉంటారు. ‘ఉగ్రమ్‌’, ‘కేజీయఫ్‌’ (KGF) , ‘సలార్‌’ (Salaar) ఇలా అన్నమాట. మరి తారక్‌ కోసం ఏ పేరు పెడతారో చూడాలి. ఇక అనుపమ సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం ‘పరదా’ (Paradha) , ‘బైసన్‌’, ‘లాక్‌డౌన్‌’ తదితర సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో స్టార్‌ హీరోలతో అయితే సినిమాలేవీ చేయడం లేదు.

మంచి కాంబో మిస్ అయ్యింది.. చేసుంటే అదిరిపోయేది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus