Shankar: శంకర్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ రెడీనా… ఫస్ట్‌ స్టెప్‌ ఈ సినిమాతోనేనా?

అయితే సీక్వెల్‌ లేదంటే సినిమాటిక్‌ యూనివర్స్‌… ప్రస్తుతం భారతీయ సినిమాలో ఈ విషయాల గురించే చర్చ నడుస్తోంది. మన సినిమాలు ముఖ్యంగా సౌత్‌ సినిమాలు ఇలాంటి ఆలోచనను చేస్తున్నాయి. ఈ స్టైల్‌లోకి భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ కూడా వెళ్తున్నారా? ఏమో కోడంబాక్కం టాక్స్ వింటుంటే అలానే అనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శంకర్‌ నుండి రాబోయే రెండు సినిమాలు సినిమాటిక్‌ యూనివర్స్‌ నుండే అని అంటున్నారు. అంటే ‘ఇండియన్‌ 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ మధ్య లింక్‌ ఉంటుంది అని అంటున్నారు.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా తమిళ చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న లీకుల ప్రకారం ‘ఇండియన్‌ 2’లో రామ్‌ చరణ్‌ పాత్ర ఉంటుంది అని అంటున్నారు. అంటే ‘గేమ్‌ ఛేంజర్‌’లో చరణ్‌ రెండు పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అందులో పాత రామ్‌చరణ్‌ పాత్రను, ‘ఇండియన్‌ 2’లో సేనాపతి పాత్రను లింక్‌ చేస్తున్నారని అంటున్నారు. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా చూపిస్తారని చెబుతున్నారు. ఈ మేరకు కీలక సన్నివేశాల చిత్రీకరణను బయటకు సమాచారం పొక్కకుండా చేస్తారని టాక్‌.

‘గేమ్‌ ఛేంజర్‌’లో పెద్ద రామ్‌చరన్‌ 80ల కాలం నాటి వ్యక్తిగా, రాజకీయాలంటే ఆసక్తి ఉన్న వ్యక్తిగా కనిపిస్తారట. ఇక ‘ఇండియన్‌ 2’లో సేనాపతి అప్పటి సమయంలో ఉన్నట్లు చూపించి… కాంబోని ఫిక్స్‌ చేసే పనిలో ఉన్నారట. అలా ‘శంకర్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’ను సిద్ధం చేసే పనిలో ఉన్నారని టాక్‌. అయితే ఇందులో నిజానిజాలేంటి? ఇవి పస ఉన్న పుకార్లేనా అనేది త్వరలో తేలుతుంది. ఈ రెండు సినిమాలు తెలుగులో దిల్‌ రాజు ఆధ్వర్యంలో వస్తాయనే విషయం తెలిసిందే.

‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తుంటే… ‘ఇండియన్‌ 2’ సినిమాను ఆయనే తెలుగులో రిలీజ్‌ చేస్తారట. అన్నట్లు ‘గేమ్‌ ఛేంజర్‌’ అప్‌డేట్‌ కోసం చాలా కాలంగా వెయిట్‌ చేస్తున్న అభిమానులకు గుడ్‌ న్యూస్‌. ఈ సినిమా నుండి దసరాకు ఓ పాటను రిలీజ్‌ చేస్తారట. మరి ఏ సాంగ్‌ వస్తుందో చూడాలి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus