బన్నీ- త్రివిక్రమ్ సినిమాకి… మహేష్ ట్వీట్ కి సంబంధమేమిటి..?

మహేష్ బాబు ట్వీట్ చేస్తే… అది త్రివిక్రమ్ పై ఎఫెక్ట్ పడిందట. ఇదేంటి మహేష్ బాబు ట్వీట్ చేస్తే.. అది త్రివిక్రమ్ కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది.. అందులోనూ వీళ్ళిద్దరూ కలిసి ఏ సినిమా చేయడం లేదు కదా… అని ఆలోచిస్తున్నారా..? విషయేమిటంటే… ‘మహేష్ 26’ ని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవ్వకపోవడంతో… అది కాస్త లేట్ అవ్వనుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పై స్వయంగా మహేష్ బాబే ట్వీట్ చేసి… క్లారిటీ ఇచ్చాడు. కొన్ని కారణాల వలన సుకుమార్ తో మహేష్ చేయాల్సిన సినిమా జరగడంలేదని… సుకుమార్ గారి నెక్స్ట్ సినిమాకి ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేసాడు.

అయితే ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ నే బన్నీతో సుకుమార్ తెరేక్కించబోతున్నాడని… అల్లు అర్జున్ కి అది 20 వ చిత్రమని వార్తలు వచ్చాయి. అయితే ఈ స్క్రిప్ట్ ఫుల్ గా రెడీ చేయడానికి మరో నాలుగు నెలలు సమయం పడుతుందని తెలిసింది. అయితే బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అధికారికంగా ఈ చిత్రం పై క్లారిటీ ఇచ్చినప్పటికీ… ఇంకా సెట్స్ పైకి తీసుకువెళ్ళలేదు. మరో నెలలో ఈ చిత్రం మొదలవుతుందని అనుకున్నా… సుకుమార్ నాలుగు నెలల్లో స్క్రిప్ట్ పూర్తి చేస్తే… త్రివిక్రమ్ తో బన్నీ చేసే చిత్రం సగం కూడా పూర్తయ్యే అవకాశం ఉండదు. పైగా సుకుమార్ కోసం బన్నీ… త్రివిక్రమ్ పై ఒత్తిడి చేసే అవకాశం కూడా ఉంది. అందులోనూ బన్నీ గత రెండు చిత్రాలూ… నిరాశపరిచాయి. ఈ క్రమంలో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలి. దేంతో పాటూ సినిమా కూడా ఫాస్ట్ గా తెరకెక్కించాలి. ఇలా మహేష్ చేసిన ఓ ట్వీట్… త్రివిక్రమ్ ని కలవరపెడుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus