రెమ్యూనరేషన్ కోసమే మహేష్…. సుకుమార్, సందీప్ కి హ్యాండ్ ఇచ్చాడట..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 25 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన 26 వ చిత్రాన్ని లైన్లో పెట్టాడు మహేష్ బాబు. ఇక ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ చిత్రాన్ని పక్కన పెట్టి అనిల్ రావిపూడి సినిమా ఎందుకు పట్టాలెక్కిస్తున్నాడు అని అందరూ అనుకున్నారు. దీనికి ముఖ్య కారణం తన రెమ్యూనరేషనే అని తెలుస్తుంది. ఇక ‘మహేష్ 26’ ను దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం మహేష్ బాబు 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడని ఫిలింనగర్లో చర్చ జరుగుతుంది.

అనీల్ రావిపూడి- మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం ప్రొడక్షన్ విలువ 50 కోట్లు ఉంటుందట. మహేష్ రెమ్యునరేషన్ కాకుండా.. జియో టీవీ నుండీ మొత్తం డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు సంబంధించి 50 కోట్లు ఆఫర్ చేశారట. దీంతో ప్రొడక్షన్ కాస్ట్ ఆ విధంగా కవర్ అయిపోతుంది. ఇక సినిమా థియేట్రికల్ రైట్స్ వంద కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉంది. ఇక ఇందులో మహేష్ కి సగానికి సగం రెమ్యునరేషన్ గా ఇస్తామని ఆఫర్ వచ్చిందట. సో ఇలా చూసుకుంటే… మహేష్ కి 50 కోట్లు రెమ్యూనరేషన్ అందుతుందన్న మాట. ఇందుకోసమే మహేష్ సుకుమార్ తో చేయాల్సిన చిత్రాన్ని, అలాగే సందీప్ రెడ్డి వంగా తో చేయాల్సిన చిత్రాల్ని పక్కన పెట్టేసాడని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus