‘దాసరి నారాయణరావు తర్వాత ఎవరు?’… టాలీవుడ్‌లో ఈ మాట చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది. దాసరి దివికేగిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఈ మాటకు సరైన సమాధానం దొరకడం లేదు. ఎందుకంటే దీనికి సమాధానం చెప్పేవారు లేరు. దీంతో ఎవరికి వారు ‘తామే నెక్స్ట్’ అని చెప్పుకోరు. కానీ పక్కనున్నవారితో చెప్పిస్తూ ఉంటారు. తాజాగా ‘మా’ ఎన్నికల సందర్భంలో ఇదే జరిగింది. ఆ మాట అన్నది నరేశ్. ఎవరి కోసం అన్నారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
దాసరి తర్వాత… అంతటి పెద్దరికం తీసుకోవడానికి టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. కృష్ణ, కృష్ణంరాజు, రాఘవేంద్రరావు, మోహన్‌బాబు, చిరంజీవి… ఇలా కొన్ని పేర్లు కనిపిస్తాయి. అందులో మీడియాలో తరచుగా వినిపించే పేర్లు చిరంజీవి, మోహన్‌బాబు. ఈ ఇద్దరూ దాసరికి బాగా దగ్గరి వారు కావడం గమనార్హం. దీంతో వీరిలో ఎవరో ఒకరు పక్కా అని అంటుంటారు. కానీ ఇద్దరిలో ఎవరూ ముందుకురారు. కానీ… ఆ స్థాయిలో మాటలు వస్తుంటాయి. ఇండస్ట్రీలో సమస్యలు వచ్చినప్పుడు…
ఒకప్పుడు తెరుచుకునే తలుపు దాసరిదే. ఆయన పోయాక… సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. అయితే కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు, సహాయలు చేసిన హీరో, చేయడానికి తొలుత మందుకొచ్చిన హీరో చిరంజీవి. అలాగే ఇండస్ట్రీ సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలన్నా చిరంజీవి నేతృత్వంలో బృందమే వెళ్తుంది. ఈ సమయాల్లో మోహన్‌బాబు ఎప్పుడూ లేరు. కానీ… ‘మా’ ఎన్నికల తర్వాత జరిగిన ప్రెస్‌మీట్‌లో నరేశ్ ఓ మాట అన్నారు.
దాసరి తర్వాత ఆ స్థానం తీసుకొని మోహన్‌బాబు పరిశ్రమ కోసం ముందుకు రావాలి అని. ఆ మాటను మోహన్‌బాబు కొట్టిపారేశారు. ముందు చెప్పుకున్నట్లు పెద్దలు తమ మనసులో మాటను… పక్కవాళ్లతో చెప్పిస్తుంటారు అని. ఆ లెక్కన మోహన్‌బాబు కాదంటూనే ‘పెద్ద’ అవతారం ఎత్తుతారా? చూడాలి.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు