పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. పవన్ కళ్యాణ్ అసిస్టెంట్ గా మరొక నటి కూడా ఈ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. సూర్య అనే వెబ్ సిరీస్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి మౌనిక రెడ్డి ఈ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు.
ఈ విధంగా భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మౌనిక రెడ్డికి అనంతరం సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె సందీప్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారు. అయితే పెద్దల సమక్షంలో వీరిద్దరూ గత ఏడాది గోవాలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక ఈమె వివాహం జరిగి ఏడాది కూడా కాకుండానే విడాకులు తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇలా ఈమె విడాకుల వార్తలు రావడానికి కూడా కారణం లేకపోలేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మౌనిక రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన భర్తతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు అన్నింటిని కూడా డిలీట్ చేశారు . అదేవిధంగా తన భర్తని సోషల్ మీడియాలో కూడా అన్ ఫాలో అయ్యారు. ఈ విధంగా తన భర్త ఫోటోలన్నింటినీ కూడా ఈమె డిలీట్ చేయడంతో బహుశా ఈమె కూడా నిహారిక సమంత బాటలోనే పయనిస్తూ తన భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
అందుకే ఇలా తన భర్త ఫోటోలు తొలగించారని నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈమె విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలు పై ఎక్కడ అధికారకంగా ప్రకటన లేదు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే మౌనిక రెడ్డి (Mounika Reddy) స్పందించాల్సి ఉంటుంది.