Kingdom: ‘కింగ్డమ్’ కి కూడా ప్రీమియర్సా.. సరైన డెసిషనేనా?

కొత్త సినిమాలకి రిలీజ్ రోజు కంటే ముందు ప్రీమియర్స్ వేయడం అనేది కొత్త పద్ధతి కాదు. తమ కంటెంట్ పై ఉన్న నమ్మకంతో కొంతమంది మేకర్స్ తమ సినిమాలకు ప్రీమియర్ షోలు వేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఇవి సినిమాకి బాగా ప్లస్ అవుతాయి. ఇంకోసారి మైనస్ కూడా అవుతాయి.

 

Kingdom

ఆ మైనస్ అయిన సినిమాలకి బాక్సాఫీస్ వద్ద డ్యామేజ్ కూడా గట్టిగానే ఉంటుంది. అందుకే నిర్మాతలు తమ సినిమాలకు ప్రీమియర్ షోలు వేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాలకు అంత ఈజీగా ప్రీమియర్ షోలు వంటివి వేయరు. కానీ ‘పుష్ప 2’ తో మళ్ళీ ఆ సందడి మొదలైంది. తాజాగా ‘హరిహర వీరమల్లు’ సినిమాకి కూడా ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. అయితే ‘హరిహర వీరమల్లు’ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమాకి కూడా ప్రీమియర్స్ వేయబోతున్నారట.జూలై 31న ఈ సినిమా విడుదల కానుంది. అయితే జూలై 30న రాత్రి నుండి ప్రీమియర్ షోలు వేస్తారట. 9 గంటల నుండి ప్రీమియర్ షోలు వేయనున్నట్టు టాక్ నడుస్తుంది. టికెట్ రేట్లు కూడా పెంచుతున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల టికెట్ రేట్లు బాగా తక్కువగా ఉన్నాయి. ఆ ఏరియాల వరకు టికెట్ రేట్లు రూ.75 వరకు పెంచనున్నారు. ఇదెలా ఉన్నా.. ప్రీమియర్ షోలు అనేది రిస్కీ డెసిషన్ అనే చెప్పాలి. ఎందుకంటే.. విజయ్ దేవరకొండ ఇప్పుడు ప్లాపుల్లో ఉన్నాడు.

నాగవంశీకి కూడా ప్రీమియర్లు అంతగా కలిసి రాలేదు. ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో..! ‘గుంటూరు కారం’ కి అర్ధరాత్రి షోలు వేశాడు. రిజల్ట్ తెలిసిందే. ‘దేవర’ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా దానికి కూడా అర్ధరాత్రి షోలు వేశాడు. దానికి కూడా రిజల్ట్ సేమ్. అయినా ‘కింగ్డమ్’ కి మరోసారి ప్రీమియర్స్ ప్లాన్ చేశాడు. మరి ఈసారి అతనికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.

 

షూటింగ్‌లో ప్రమాదం.. ‘డెకాయిట్‌’ కపుల్‌కి ఏమైంది?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus