Decoit: షూటింగ్‌లో ప్రమాదం.. ‘డెకాయిట్‌’ కపుల్‌కి ఏమైంది?

సినిమా షూటింగ్‌లో ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. కొన్ని బయటకు వస్తుంటే, ఇంకొన్ని కామ్‌గా ఉంచేస్తున్నారు. మొన్నీ మధ్యే ‘వేట్టువం’ సెట్స్‌లో ప్రమాదవశాత్తు స్టంట్‌ మ్యాన్‌ చనిపోయారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ ఘటన జరిగింది. ఇప్పుడు అంత పెద్దది కాదు కానీ.. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఓ ప్రమాదంలో గాయపడ్డారు అని సమాచారం. ఇద్దరూ కలసి నటిస్తున్న ‘డెకాయిట్‌’ సినిమా షూటింగ్‌లో యాక్సిడెంట్‌ జరిగిందట. దీంతో ఇద్దరూ గాయపడ్డారు అని సమాచారం.

Decoit

సినిమాలోని ఓ కీలకమైన యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ గాయాలతోనే హీరో హీరోయిన్లు షూటింగ్ పూర్తి చేశారు అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో సినిమా టీమ్‌ నుండి ఎలాంటి అధికారిక సమాచారం అయితే రాలేదు. ప్రస్తుతం ఇద్దరూ రెస్ట్‌లో ఉన్నారని.. అంతా సర్దుకున్నాక తిరిగి చిత్రీకరణ ప్రారంభిస్తారని చెబుతున్నారు.

లవర్స్ బద్ధ శత్రువులుగా ఎలా మారారు? రోడ్డు మీద శవాల మధ్య వారి మధ్య వార్ ఎలా సాగింది అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది అని సమాచారం. షానీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డిసెంబరులో రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. ఆ మేరకు డిసెంబరు 25ని డేట్‌గా ఇటీవల అనౌన్స్‌ చేశారు కూడా. మరిప్పుడు హీరో, హీరోయిన్‌ గాయపడిన నేపథ్యంలో సినిమా అనుకున్న తేదీకి వస్తుందో లేదో చూడాలి.

చిక్కుల్లో పడ్డ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus