Niharika, Vaishnav Tej: మోస్ట్‌ లైక్డ్‌ కాంబో వెండితెరకి రాబోతోందా? వస్తే వావ్‌ అనాల్సిందే!

కొన్ని జోడీలు భలే క్యూట్‌గా ఉంటాయి. ఆ ఫొటోలు కనిపించగానే సోషల్‌ మీడియాలో లైకులే లైకులు పడుతుంటాయి. అలాంటి జోడీల్లో (Panja Vaisshnav Tej) వైష్ణవ్‌ తేజ్‌ – (Niharika Konidela) నిహారిక ఒకటి. వరుస బావామరదళ్లు అయిన ఈ ఇద్దరి ఫొటో ఒకటి ఆ మధ్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఏదో ఫంక్షన్‌లో దిగిన ఆ ఫొటో చూసి భలే జోడీ అంటూ ఫ్యాన్స్‌ మురిసిపోయారు. ఇద్దరూ కలసి ఓ సినిమా చేయొచ్చు కదా అని అనుకున్నారు కూడా. అలా అనుకున్నవారిలో మీరు కూడా ఉండుంటే… మీ మాట నిజం అవుతోంది.

అవును, నిహారిక – వైష్ణవ్‌ తేజ్‌ జోడీగా ఓ సినిమా మెటీరియలైజ్‌ అవుతోంది అని టాక్‌. రియల్‌ లైఫ్‌ బావామరదళ్లను రీల్‌ లైఫ్‌ కపుల్‌గా చూపించాలని ఓ దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇద్దరి మధ్య క్యూట్‌ లవ్‌ స్టోరీని సిద్ధం చేశారని చెబుతున్నారు. టీవీ కార్య క్రమాలతో ప్రయాణం మొదలు పెట్టి, తరవాత వెండి తెరపైకి అడుగు పెట్టింది. కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్‌ పెట్టి సిరీస్‌లు, సినిమాలు కూడా చేసింది. ఆ తర్వాత వివిధ పరిస్థితుల నేపథ్యంలో సినిమాలు మానేసింది.

నాగశౌర్యతో (Naga Shaurya) ‘ఒక మనసు’ (Oka Manasu) సినిమా చేసి తెరంగేట్రం చేసింది నిహారిక. ఆ తర్వాత చేసిన సినిమాలు కలిసి రాలేదు. మధ్యలో కొన్ని వెబ్‌ సిరీస్‌ నటించింది, నిర్మించింది కూడా. ఇటీవల (Dead Pixels) ‘డెడ్ ఫిక్సల్’ అనే సిరీస్‌లో నటించింది. ఆ తర్వాత ఉన్నపళంగా తన ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేసింది. గ్లామర్‌ ఫొటోషూట్‌లతో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ‘చెఫ్ మంత్ర’ అనే షోను కూడా హోస్ట్ చేస్తోంది. ఇప్పుడు హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తోంది అని అంటున్నారు.

‘ఉప్పెన’ (Uppena) సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారీ విజయం అందుకున్న వైష్ణవ్‌… ఆ తర్వాత ఆ స్థాయిలో విజయం అందుకోలేదు. ఇప్పుడు ఈ బావా, మరదలను కలిపి సినిమా చేయాలని ఓ కొత్త దర్శకుడు ప్రయత్నం చేస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని టాక్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌ చేస్తారట.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus