పవన్ సినిమా విషయం తేలట్లేదట!

ప‌వ‌న్ కళ్యాణ్ కొత్త సినిమా అసలు ఉంటుందా..? అనే ప్రశ్న ఆయన అభిమానుల్లో కలుగుతోంది. ప‌వ‌న్, ఎస్‌.జె.సూర్య సినిమా ప‌ట్టాలెక్కేస‌మ‌యంలో సూర్య ఈ సినిమా నుంచి అర్థాంత‌రంగా త‌ప్పుకొన్నాడు. వెంట‌నే డాలీని రంగంలోకి దింపి… అంద‌రికీ షాక్ ఇచ్చాడు ప‌వ‌న్‌. అయితే అస‌లు ఇప్పుడు ఈ సినిమా ఉంటుందా, లేదా? అనేదీ టాక్‌.

ఈ స్క్రిప్టు పై ప‌నిచేయ‌డానికి డాలీకి ఇష్టం లేద‌ని, బ‌ల‌వంతంగా ఈ ప్రాజెక్టులోకి వ‌చ్చాడ‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప‌వ‌న్ కూడా ఇష్టం లేకుండానే ఈ సినిమా చేస్తున్న‌ట్టు వినికిడి. అలాంట‌ప్పుడు ఈ ప్రాజెక్టు ఆపేయ‌డ‌మే మంచిద‌ని ప‌వ‌న్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ని, ఈ విష‌యంపై నిర్మాత శ‌ర‌త్ మ‌రార్‌తో సీరియ‌స్ గా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ని టాక్‌. త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా చేయాల‌నుకొంటున్నాడు ప‌వ‌న్‌. త్రివిక్ర‌మ్ కోసం కొన్ని రోజులు ఆగితే.. ఆ సినిమానే మొద‌లెట్టొచ్చు క‌దా అని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్టు టాక్‌. మ‌రి ఈ విషయంలో చివరకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus