భారీ అంచనాలు, లక్షలాది అభిమానుల ఆశలు నడుమ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడిన పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రం దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. పరాజయాన్ని చాలా హుందాగా స్వీకరించిన పవన్ కళ్యాణ్ తాను గెలుపోటములతో సంబంధం లేకుండా తుదిశ్వాస వరకూ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను అని స్పష్టం చేశాడు కూడా. ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది కానీ.. పవన్ ఈ అయిదేళ్ళ కాలంలో ప్రజలను కేవలం ఒక నాయకుడిగా ఆయన పలకరిస్తే ఆయనకి విజయం దక్కే అవకాశాలున్నాయా అనే అనుమానాలు మొదలయ్యాయి.
అందుకు కారణాలు లేకపోలేదు.. స్టార్ హీరోగా కేవలం ఒక ఏడాది గ్యాప్ తీసుకొన్న తర్వాతే పవన్ కళ్యాణ్ “జనసేన” 2019 ఎలక్షన్స్ లో ఎలాంటి మార్క్ క్రియేట్ చేయలేకపోయింది. అలాంటిది ఈ అయిదేళ్లలో పవన్ కళ్యాణ్ కేవలం పాలిటిక్స్ కి మాత్రమే పరిమితమైపోతే.. ఉన్న చరిష్మా, క్రేజ్ కూడా కోల్పోయే అవకాశాలు లేకపోలేదు. ఆ కారణంగా పవన్ కళ్యాణ్ అభిమానులే కాక సినీ మరియు రాజకీయ విశ్లేషకులు కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వెల్లడమే సబబు అని అభిప్రాయపడుతున్నారు. సినిమాలు చేస్తూనే ప్రజల్లో మనిషిగా ఆయన వ్యవహరించగలిగితే.. తప్పకుండా 2024 ఎలక్షన్స్ టైమ్ కి ఒక రాష్ట్రీయ స్థాయి పోలిటికల్ లీడర్ గా ఎదిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏం డిసైడ్ అయ్యాడు అనేది తెలియాల్సి ఉంది.