పాయల్… వరుసగా సీనియర్లతోనా … కష్టమేమో…?

  • February 19, 2019 / 04:25 PM IST

అప్పట్లో 20 ఏళ్ళ వయసు రాకుండానే అతిలోకసుందరి శ్రీదేవి.. 60 ఏళ్ళు పై వయసుగల ఎన్టీఆర్, ఏఎన్నార్‌ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. అయితే అప్పటి రోజులు అలాంటివి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పటి సీనియర్ హీరోల పక్కన యువ హీరోయిన్లు నటిస్తే మళ్ళీ యువ హీరోల పక్కన ఛాన్సులు దొరకడం కష్టమేమోనని ఇప్పటి హీరోయిన్లు భయపడుతున్నారు. ముందుగా స్టార్ యువ హీరోల పక్కన చేసిన తరువాతే సీనియర్ హీరోల సరసన నటించడానికి రెడీ అవుతున్నారు. అయితే మన ‘ఆర్.ఎక్స్.100’ బ్యూటీ పాయల్ రాజ్పుత్ దీనికి భిన్నంగా ఉంది.

ప్రస్తుతం పాయల్ రాజ్పుత్…. మాస్ మహారాజ్ రవితేజ సరసన ‘డిస్కో రాజా’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు అక్కినేని అందగాడు ‘కింగ్’ నాగార్జున సరసన కూడా ‘మన్మధుడు 2’ లో ఓ హీరోయిన్ గా నటించడానికి రెడీ అవుతుంది. ఇలా ఇద్దరి సీనియర్ హీరోల సరసన నటిస్తుంది ఎలా అనుకునేలోపు మరో సీనియర్ హీరో సరసన కూడా నటించడానికి రెడీ అవుతుందట. వివరాల్లోకి వెళితే విక్టరీ వెంకటేష్ – నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీ మామ’ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.అయితే యువ హీరో నాగ చైతన్య సరసన అనుకోకండి… మన వెంకీ సరసన పాయల్ జతకడుతుంది. మొదట వెంకీ సరసన శ్రీయ ని అనుకున్నప్పటికీ… ఇప్పుడు పాయల్ ని సెలెక్ట్ చేసారని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. ఇలా పాయల్ వరుసగా సీనియర్ హీరోల సరసన నటిస్తుండడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలా వరుసగా సీనియర్ హీరోల సరసన నటిస్తే యువ హీరోల పక్కన చాన్సులు వస్తాయా… ? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు.మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus