ప్రభాస్‌తో సినిమా చేయడం అంటే ఇప్పుడు అంత సులభమేమీ కాదు. కారణం ఆయన లైనప్ అలా ఉంది మరి. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనూ ప్రభాస్‌కు కథలు వినిపించే దర్శకులు చాలామంది ఉన్నారు. చాలా కథలు చాలావరకు ఓకే అయిపోయినా, సెట్స్‌పైకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ‘ధూమ్ 4’ కూడా ఇదే రకమైన కారణంతో ప్రభాస్ నుండి వెళ్లిపోయిందంటున్నారు. బాలీవుడ్ ‘ధూమ్’ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలొచ్చాయి.
అన్నింటిలో హీరోల కంటే, విలన్లే ఎక్కువ హైలైట్ అయ్యారనే చెప్పాలి. అలా జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ విలన్లుగా మెప్పించారు. ఈ క్రమంలో నాలుగో ‘ధూమ్’ వస్తుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. ఇందులో విలన్‌గా ప్రభాస్‌ను అనుకుంటున్నారని కూడా అన్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమాను ప్రభాస్ వద్దనుకుంటున్నాడట. ‘ధూమ్ 4’ ఛాన్స్‌ను ప్రభాస్ ఓకే చేశాడని ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు వద్దనుకున్నాడనే విషయమూ అంతే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సమయంలో ‘ధూమ్’ చేయడం కష్టమని ప్రభాస్ భావిస్తున్నాడట.
అయితే ప్రభాస్‌తో సినిమా ఇంత త్వరగా వీలయ్యే పరిస్థితులు లేకపోవడంతో నిర్మాత ఆదిత్య చోప్రానే సెకండ్ థాట్‌లో పడ్డాడని కూడా వార్తలొస్తున్నాయి. అయినా ‘ధూమ్ 4’ వదులుకోవడం అంటే… రాంగ్ స్టెప్ అనే చెప్పాలి.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!