Tollywood: టాలీవుడ్‌ లీక్‌ కష్టాలు: అప్‌డేట్‌ టైమ్‌కి ఇవ్వకపోతే.. క్లారిటీ ఇవ్వాల్సి వస్తోందా?

మీరు చెబుతారా? మేమే చెప్పేయాలా? గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో (Tollywood) ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ల గురించి నిర్మాణ సంస్థలు ఓవైపు ఊరిస్తుంటే.. మరోవైపు లీకులు వాళ్లను అల్లాడిస్తున్నాయి. సినిమాకు ఎంతో కీలకమైన టైటిల్స్‌, లుక్స్‌ అలా బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో నిర్మాణ సంస్థలు ఆ విషయంలో క్లారిటీ ఇస్తూ పోస్టర్లు రిలీజ్‌ చేయాల్సి వస్తోంది. కావాలంటే మీరే చూడండి. ‘పుష్ప : ది రూల్‌’ (Pushpa 2)  సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌లో అల్లు అర్జున్‌ (Allu Arjun)  సరసన శ్రీలీల  (Sreeleela) డ్యాన్స్‌ చేయనుంది అని గత కొన్ని రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Tollywood

అయితే సినిమా టీమ్‌ నుండి ఎలాంటి సమాచారం లేదు. సినిమా షూటింగ్‌ మొదలైనప్పుడు కూడా చెప్పలేదు. ఈ క్రమంలో సెట్స్‌ నుండి ఓ లీక్‌ బయటకు వచ్చింది. అందులో శ్రీలీల, అల్లు అర్జున్‌ డ్యాన్సింగ్‌ మూడ్‌లో ఉన్నారు. కట్‌ చేస్తే నిన్న పోస్టర్‌ రిలీజ్‌ చేసి అనౌన్స్‌ చేశారు. మొన్నీమధ్యకే ‘హిట్‌ 3’ సినిమా నుండి ఇలాంటిదే జరిగింది. సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే విషయం ఇన్నాళ్లూ దాచిన టీమ్‌ అనూహ్యంగా ఓ రోజు శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) అని అనౌన్స్‌ చేశారు.

మామూలుగా అయితే అక్టోబరు 21న ఆమె పుట్టిన రోజు సందర్భంగా రావాల్సిన ‘హిట్‌ 3’ పోస్టర్‌ అక్టోబరు 2నే వచ్చేసింది. ఎందుకంటే వైజాగ్‌లో సినిమా షూటింగ్‌ జరుగుతుండగా ఆన్‌ సెట్స్‌ వీడియో ఒకటి లీక్‌ అయింది. ఇక నాని (Nani)  – శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) రెండో సినిమా పేరు విషయంలోనూ దాదాపు ఇదే జరిగింది. సినిమా పేరు ‘ప్యారడైజ్‌’ అని వాళ్లు రిలీజ్‌ చేయకుండానే లీక్‌ అయింది.

అయితే ఆ లీక్‌ నిజంగానే ‘లీకా? లేక’ అనే డౌట్‌ కూడా ఉంది. ఆ విషయం వదిలేస్తే అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పకపోతే ఇదిగో లీకులు జరిగి.. ఆ తర్వాత పోస్టర్లు రిలీజ్‌ చేసి సెకండ్‌ లుక్‌ రిలీజ్ చేసినట్లు అవుతోంది. ఈ నేపథ్యంలో లీకులు, లుక్‌ల విషయంలో నిర్మాణ సంస్థలు ఓ ఆలోచనకు రావాలి.

సింపుల్ గా క్రిష్ రెండో వివాహం.. ఫొటో వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus